Begin typing your search above and press return to search.

హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ.. లావణ్య స్పెషల్ పోస్ట్!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జంటగా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

By:  Madhu Reddy   |   2 Nov 2025 8:49 AM IST
హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ.. లావణ్య స్పెషల్ పోస్ట్!
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జంటగా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొంతకాలంగా ప్రేమలో పడ్డ వీరు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. తర్వాత 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్క్ నీలో బోర్గో శాన్ ఫెలిస్ లో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్, సాయి ధరంతేజ్ , నిహారిక ఇలా మెగా వారసులంతా హాజరై తెగ సందడి చేసిన విషయం తెలిసిందే.





ఈ ఏడాది జూన్లో తల్లిదండ్రులను కాబోతున్నాం అంటూ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని.. చిన్న పాపాయి షూస్ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. తాము తల్లిదండ్రులం కాబోతున్నాం అంటూ అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది లావణ్య. వారసుడు రాకతో ఆ ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటిన విషయం తెలిసిందే . తమ కుమారుడుకి వాయు తేజ్ అంటూ నామకరణం కూడా చేసింది ఈ జంట. అంతేకాదు ఇటీవల తమ ఇంటికి వారసుడు వచ్చిన సందర్భంగా దీపావళి వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు కూడా.





అలా సంతోషంగా సాగుతున్న ఈ జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టి ముచ్చటగా రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లావణ్య త్రిపాఠి ఒక స్పెషల్ పోస్టును ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. తాజాగా తన భర్తతో కలిసి ఉన్న రొమాంటిక్ క్షణాలను షేర్ చేస్తూ.. మరొకవైపు తమ కుమారుడిని వరుణ్ తేజ్ చూసుకుంటున్న క్షణాలకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇక బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. "స్నేహితుడి నుండి ప్రియుడు.. కాబోయే భర్త.. భర్త.. ఇప్పుడు తండ్రి వరకు ప్రతి పాత్రను మీరు చాలా అందంగా పోషించారు. మా జీవితాల్లో మిమ్మల్ని కలిగి ఉండడం మాకు నిజంగా అదృష్టం. మీలాంటి హృదయం ఎప్పటికీ గౌరవించబడడానికి అర్హమైనది. వార్షికోత్సవ శుభాకాంక్షలు" అంటూ లవ్ ఎమోజిని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నిహారిక , ఉపాసన తదితర సెలబ్రిటీలు ఈ జంటకు వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.





లావణ్య త్రిపాఠి సినిమాల విషయానికొస్తే.. తమిళంలో థనల్ అనే సినిమాలో నటించి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే సతీ లీలావతి అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటూ కోనసీమలో చిట్టమ్మ కిట్టయ్య, నీలవేణి వంటి చిత్రాలలో నటిస్తోంది.