సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే అల్లు అర్జునే! లావణ్య మాటలు వైరల్
మెగా కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్నారు హీరోయిన్ లావణ్య త్రిపాఠి.
By: Sravani Lakshmi Srungarapu | 5 May 2026 12:20 PM ISTమెగా కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్నారు హీరోయిన్ లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న లావణ్య, కెరీర్ ప్రారంభం నుంచే కథా ప్రధాన సినిమాలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగారు. తర్వాత పలు సక్సెస్‌ఫుల్ సినిమాల్లో నటించిన ఆమె, మిస్టర్ సినిమా టైమ్ లో తన కో యాక్టర్ వరుణ్ తేజ్ తో ఏర్పడిన స్నేహం, తర్వాత ప్రేమగా ఆ తర్వాత వివాహ బంధంగా మారింది. పెళ్లి తర్వాత కూడా లావణ్య సినిమాల్లో కొనసాగుతూ వస్తున్నారు.
ప్రస్తుతం లావణ్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన సతీ లీలావతి సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో డైరెక్టర్ తాతినేని సత్య తెరకెక్కించిన ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను రాబట్టగా, ఈ సినిమాతో లావణ్య మరోసారి తన నటనతో ఆకట్టుకునే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేయడం కూడా సినిమాపై హైప్‌ను పెంచింది. ఇది మెగా కుటుంబం నుంచి లావణ్యకు లభిస్తున్న మద్దతుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
ఇక వ్యక్తిగతంగా మెగా మరియు అల్లు కుటుంబ సభ్యులతో లావణ్యకు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. లావణ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సెన్సాఫ్ హ్యూమర్ విషయంలో ఎవరి నుంచి నేర్చుకోవాలనుకుంటారనే ప్రశ్నకు లావణ్య ఎలాంటి సందేహం లేకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరును ప్రస్తావించారు. ఆయనకు ఉన్న టైమింగ్, సెన్సాఫ్ హ్యూమర్ తనకు చాలా ఇష్టమని, అలాంటి క్వాలిటీ ఎవరికైనా ఉండాలి అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారి తీశాయి. మెగా కుటుంబంలోనే పలువురు స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, లావణ్య అల్లు అర్జున్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. దీని వల్ల ఆమెకు అల్లు కాంపౌండ్‌తో కూడా సమానంగా అనుబంధం ఉందనే అభిప్రాయం బలపడుతోంది. సోషల్ మీడియాలో అభిమానులు కూడా ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ, లావణ్యకు రెండు కుటుంబాల నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే, లావణ్య త్రిపాఠి వ్యక్తిగత జీవితం, కుటుంబ అనుబంధాలు, అలాగే కెరీర్ ఎంపికలు.. ఈ మూడు అంశాల్లోనూ సమతుల్యతను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. సతీ లీలావతి రిలీజ్ తర్వాత ఆమె కెరీర్‌లో కొత్త మలుపు తిరుగుతుందా అనే ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో నెలకొంది.
