Begin typing your search above and press return to search.

స్నేహ‌మంటే ఇదేరా.. ప్ర‌గ్యతో మంచు ల‌క్ష్మి బ‌ర్త్‌డే పార్టీ

నటి, నిర్మాత మంచు లక్ష్మి ప్ర‌స‌న్న‌ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టాలీవుడ్ లో అరుదైన బ‌హుముఖ ప్ర‌జ్ఞా వంతురాలిగా అంద‌రి మెప్పు పొందారు.

By:  Sivaji Kontham   |   9 Oct 2026 12:13 PM IST
స్నేహ‌మంటే ఇదేరా.. ప్ర‌గ్యతో మంచు ల‌క్ష్మి బ‌ర్త్‌డే పార్టీ
X

నటి, నిర్మాత మంచు లక్ష్మి ప్ర‌స‌న్న‌ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టాలీవుడ్ లో అరుదైన బ‌హుముఖ ప్ర‌జ్ఞా వంతురాలిగా అంద‌రి మెప్పు పొందారు. న‌టిగాను రెండు ద‌శాబ్ధాల కెరీర్ లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో అల‌రించారు. అయితే ఇటీవ‌ల కొన్నేళ్లుగా ముంబైలో ల‌క్ష్మి మంచు నివాసం ఉంటున్నారు. అక్క‌డ ప్ర‌గ్య జైశ్వాల్, ర‌కుల్ ప్రీత్ స‌హా త‌న స్నేహితుల‌తో సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ప్ర‌తి ఫోటోగ్రాఫ్, వీడియోను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తూ మంచు ల‌క్ష్మి త‌న ఉనికిపై హింట్ ఇస్తూనే ఉన్నారు.





తాజాగా ల‌క్ష్మీ మంచు జన్మదినం సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. ఈ పోస్ట్ కింద వచ్చిన కామెంట్స్ విభాగం, ఆధునిక అభిమాన సంస్కృతికి.. డిజిటల్ కమ్యూనికేషన్ శైలికి ఒక అద్దంలా నిలుస్తుంది. ల‌క్ష్మీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, తోటి నటీనటులు, శ్రేయోభిలాషులు పెద్దఎత్తున ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఎమోజీలు, రెడ్ హార్ట్స్ షేర్ చేస్తూ.. ``మీరు మా జీవితాల్లో ఉండటం అదృష్టం`` అంటూ అభినందిస్తూ వేలాది మంది తమ ప్రేమను చాటుకున్నారు. అలాగే ప్ర‌గ్య జైశ్వాల్ తో ల‌క్ష్మీ స్నేహాన్ని ఉద్ధేశించి `స్నేహ‌మంటే ఇదేరా` అని కూడా కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. అలాగే బీచ్ సైడ్ రిసార్ట్ పార్టీలో స్నేహితుల ర‌చ్చ మామూలుగా లేద‌ని ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ వెల్ల‌డిస్తున్నాయి.





ఈ ఫోటోషూట్ ని ఉద్ధేశించి కామెంట్ సెక్షన్‌లలో గమనించదగ్గ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఒకవైపు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుంటే మరోవైపు పూర్తిగా సంబంధం లేని ఇతర విషయాలు క‌నిపించాయి. బర్త్‌డే విషెస్‌తో పాటు ఇతర సినిమాల విశేషాలు, నటీనటుల గురించి ప్రస్తావనలు, లేదా ఎవరో తమ కాలేజ్ క్లాస్‌మేట్‌ని ఇక్కడ గుర్తించినట్లుగా చేసే కామెంట్స్ కూడా ఇందులో దర్శనమిచ్చాయి. సెలబ్రిటీల పుట్టినరోజు వేడుకలు కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా, విభిన్న నేపథ్యాల నుండి వచ్చే నెటిజన్లు తమ అభిప్రాయాలను షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.





మ‌రో గుండెల్లో గోదారి ఎప్పుడు?

కొన్నేళ్ల క్రితం మంచు లక్ష్మి `గుండెల్లో గోదారి` చిత్రంలో పూర్తి స్థాయి న‌ట‌న‌తో మెప్పించారు. మ‌ళ్లీ అలాంటి పాత్ర‌లో ల‌క్ష్మీని చూడాల‌ని అభిమానులు ఈ సంద‌ర్భంగా కోరుకుంటున్నారు. ఓవైపు బ‌ర్త్ డే విషెస్ చెబుతూనే ల‌క్ష్మీ మంచు వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తే చూడాల‌నుంద‌ని ఫ్యాన్స్ ఆకాంక్షించారు. అయితే తన అభిమానుల కోరిక‌ను మ‌న్నించి ఈ ప్ర‌తిభావ‌ని తిరిగి మంచి పాత్ర‌ల‌తో అల‌రిస్తారేమో చూడాలి. తెలుగు, త‌మిళ చిత్ర‌సీమ‌ల్లో మునుప‌టిలా ల‌క్ష్మీ మంచు కెరీర్ ప‌రంగా బిజీ అయిపోవాల‌ని కూడా ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.