Begin typing your search above and press return to search.

'జిమ్ జిమ్ తార' లక్ష్మి స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగింది?

ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా అఫీషియల్ గా కంప్లీట్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

By:  M Prashanth   |   17 Oct 2026 10:43 AM IST
జిమ్ జిమ్ తార లక్ష్మి స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగింది?
X

సోషల్ మీడియాలో 'జిమ్ జిమ్ తార.. జిలేబి తేరా చిన్నోడా' సాంగ్ ఎంతలా వైరల్ అయిందో.. ఇప్పటికీ ఎంత ట్రెండ్ అవుతుందో.. ఎవరూ చెప్పాల్సిన పనిలేదే. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది రీల్స్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ల నుంచి డ్యాన్స్ వీడియోల వరకు ఎక్కడ చూసినా ఆ పాటే వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఆ సాంగ్ పాడిన గోకుల లక్ష్మి అలియాస్ లక్ష్మి ఆంటీ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ హాట్ టాపిక్ గా మారింది.

'జిమ్ జిమ్ తార.. జిలేబి తేరా చిన్నోడా' పాటతో లక్ష్మి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆమె నేచురల్ వాయిస్ తో పాడిన ఆ సాంగ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. వేల సంఖ్యలో రీల్స్, షార్ట్స్ వచ్చాయి. డీజే మిక్స్‌ లతోనూ సందడి చేసింది. అంతేకాదు, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న పర్ణశాల సినిమాలో కూడా ఆ సాంగ్ ను యూజ్ చేశారు.

ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా అఫీషియల్ గా కంప్లీట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఇదే పాట విషయంలో లక్ష్మి ఆంటీ ఫుల్ ఫైర్ అవుతున్నారు. తాను గత 30 ఏళ్లుగా ఆ సాంగ్ ను తాను పాడుతున్నానని ఆమె చెబుతున్నారు. తనతో కాకుండా.. వేరే వాళ్లతో ఆ పాటను పాడించి యూట్యూబ్‌ లో అప్లోడ్ చేస్తున్నారని ఆరోపించారు. తన పర్మిషన్ లేకుండా సాంగ్ ను యూజ్ చేసి వ్యూస్ ద్వారా డబ్బులు సంపాదించుకోవడం ఏంటని గట్టిగా క్వశ్చన్ చేశారు.

'మేం తిక్కోళ్లలా కనిపిస్తున్నామా? ఇక్కడ మాకు తిండి లేక ఇబ్బందులు పడుతున్నాం. అలాంటిది మా పాటను యూట్యూబ్‌ లో పెట్టుకునే రైట్స్ ఎవరిచ్చారు? మర్యాదగా ఆ వీడియో తీసేయండి. లేకపోతే పోలీసులను తీసుకొచ్చి ఫిర్యాదు చేస్తా' అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా కలిసి ఫిర్యాదు చేస్తానని క్లారిటీ ఇచ్చారు.

కొన్ని రోజుల క్రితం తన కొడుకులకు ఫోన్ చేసి పాటను కొనుక్కుంటామని కొందరు చెప్పారని లక్ష్మి ఆంటీ వెల్లడించారు. అయితే ఆ విషయం తనకు తెలియలేదని అన్నారు. ఇప్పుడు తన పర్మిషన్ లేకుండా పాటను యూట్యూబ్‌ లో పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత వీడియోలను డిలీట్ చేయాల్సిందేనని లక్ష్మీ ఆంటీ డిమాండ్ చేశారు.

అయితే లక్ష్మి ఆంటీ లేటెస్ట్ వార్నింగ్ ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఆమె తన వీడియోలో ఏ వ్యక్తి పేరు లేదా యూట్యూబ్ ఛానెల్ పేరును వెల్లడించలేదు. కానీ తన సాంగ్ ను పర్మిషన్ లేకుండా యూజ్ చేస్తున్న వారే టార్గెట్ గా వార్నింగ్ ఇచ్చినట్లు ఆమె వీడియో ద్వారా క్లియర్ గా తెలుస్తోంది. మరి ఆ కాంట్రవర్సీపై ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో.. నెక్స్ట్ ఏం జరగనుందో అంతా వేచి చూడాలి.