ఈ అరుదైన ధగధగల బ్రా వెళ రూ.474 కోట్లు.. ఆ అందానికి ఫ్యాషన్ ప్రియులు గిలగిలా!
ఇది చాలా అరుదైన బ్రా. ఇప్పటివరకూ రూపొందించిన బ్రాలలో అత్యంత ఖరీదైనది కూడా ఇదే.
By: Sivaji Kontham | 19 Oct 2026 7:37 PM ISTఇది చాలా అరుదైన బ్రా. ఇప్పటివరకూ రూపొందించిన బ్రాలలో అత్యంత ఖరీదైనది కూడా ఇదే. అయితే దీనిని ధరించినది ప్రముఖ మీడియా సెలబ్రిటీ కం ఎంటర్ ప్రెన్యూర్ కైలీ జెన్నర్. ఈ బ్యూటీ అలా ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తుంటే కళ్లన్నీ ఆ ధగధగల బ్రాపైనే.
లాస్ ఏంజెలెస్‌లో అక్టోబర్ 18న అత్యంత వైభవంగా జరిగిన విక్టోరియాస్ సీక్రెట్ ఫ్యాషన్ షోలో ప్రఖ్యాత బ్యూటీ ఎంటర్‌ప్రెనర్ కైలీ జెన్నర్ అద్భుతమైన అరంగేట్రం చేశారు. ఈ వేదికపై ఈ అందాల భరిణె బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా అత్యంత పాపులరైన `ఫాంటసీ బ్రా`ను ధరించి రన్‌వేపై నడిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా 2018 తర్వాత ఈ ఐకానిక్ ఫాంటసీ బ్రా మళ్లీ రన్‌వేపైకి రావడం ఈ ఫ్యాషన్ షో ప్రత్యేకతను మరింత పెంచింది.
ఈ ప్రదర్శనలో కైలీ ధరించిన ఫాంటసీ బ్రా ఎంతో ప్రత్యేకమైనది.. అత్యంత విలువైంది. లగ్జరీ జ్యువెలరీ హౌస్ `జాకోబ్ అండ్ కో` భాగస్వామ్యంతో రూ.474 కోట్లకు పైగా విలువ చేసే (50 మిలియన్లు) ఈ అద్భుతమైన డిజైన్‌ను రూపొందించారు. నాలుగు పౌండ్ల బరువున్న ఈ బ్రాలో 4,410 సహజ వజ్రాలు , 75.54 క్యారెట్ల రేడియంట్-కట్ ఫ్యాన్సీ వివిడ్ ఎల్లో డైమండ్‌ను పొందుపరిచారు. ఈ అరుదైన కళాఖండాన్ని సృష్టించడానికి 15 మంది నిపుణులైన కళాకారులు దాదాపు 1000 గంటల పాటు శ్రమించారు.
రన్‌వేపై తన విజయవంతమైన ప్రదర్శన అనంతరం కైలీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో బ్యాక్‌స్టేజ్ విశేషాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. తన పేరు ఎంబ్రాయిడరీ చేసిన `విక్టోరియాస్ సీక్రెట్ ఏంజిల్స్` చిహ్నమైన డైమండ్-ఎన్‌క్రస్టెడ్ వింగ్స్ ఉన్న సిగ్నేచర్ పింక్ స్ట్రైప్డ్ రోబ్‌లో ఆమె బ్యాక్‌స్టేజ్‌లో కనిపించారు. ఈ అరుదైన , మధురమైన అనుభూతిని `బెస్ట్ డే ఎవర్` అంటూ కైలీ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఈ అరుదైన ప్రదర్శనకు కైలీకి కుటుంబ సభ్యులు- సన్నిహితుల నుంచి భారీగా మద్దతు లభించింది. ఆమె తల్లి క్రిస్ జెన్నర్ `నా స్వీట్ ఏంజిల్ గర్ల్, నీ గురించి చాలా గర్వంగా ఉంది` అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, కైలీ దానిని తిరిగి షేర్ చేశారు. అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ స్టాసి కరణికొలావు, అలబామా బార్కర్ .. హెయిర్ స్టైలిస్ట్ ఇగోర్ రోలెస్ వంటి సన్నిహితులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ మద్దతును, అభినందనలను తెలిపారు.
ఫ్యాషన్ షోలో కైలీ రన్‌వేపై నడుస్తున్న సమయంలో ప్రేక్షకుల సీట్లలో కూర్చున్న ఆమె తల్లి క్రిస్ జెన్నర్ .. ప్రియుడు తిమోతీ చలమెట్ ఎంతో గర్వంగా ఉత్సాహపరిచారు. వారిద్దరూ ఎంతో ఆనందంగా క్లాప్స్ కొడుతూ కైలీని ఎంకరేజ్ చేశారు. ఇలా తన అద్భుతమైన నడకతో... అత్యంత విలువైన ఫాంటసీ బ్రా ప్రదర్శనతో కైలీ జెన్నర్ ఈ విక్టోరియాస్ సీక్రెట్ షోలో ఫ్యాషన్ చరిత్రలో నిలిచిపోయేలా తన అరంగేట్రాన్ని విజయవంతంగా కొనసాగించారు.
హాలీవుడ్ - గ్లోబల్ ఫ్యాషన్ రంగంలో కైలీ జెన్నర్ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖులలో ఒకరు. రియాలిటీ టెలివిజన్ స్టార్‌గా ప్రసిద్ధి చెందిన ఈ బ్యూటీ `కైలీ కాస్మెటిక్స్` ద్వారా విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీలలో ఒకరిగా నిలవడమే కాకుండా... తన ప్రత్యేకమైన ఫ్యాషన్ - స్టైల్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యువతను ఆకర్షిస్తూ ట్రెండ్‌సెట్టర్‌గా కొనసాగుతున్నారు. తాజాగా విక్టోరియాస్ సీక్రెట్ రన్‌వేపై అరంగేట్రం చేయడం ద్వారా ఫ్యాషన్ ప్రపంచంలో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటూ హాలీవుడ్ పాప్ కల్చర్‌లో తిరుగులేని ఐకాన్‌గా వెలుగొందుతున్నారు.
