దళపతి వల్ల స్ట్రగుల్స్..రాకింగ్ స్టార్ యష్ వల్ల హ్యాపీ!
కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ ఏడాది ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో ఎంట్రీ ఇస్తోంది.
By: Ravindar Gorantla | 2 March 2026 3:10 PM ISTకన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ ఏడాది ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో ఎంట్రీ ఇస్తోంది. ఇదే సమయంలో కన్నడతో పాటు తమిళ, తెలుగు భాషల్లో భారీ సినిమాలని నిర్మిస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ లో స్టార్ హీరో దళపతి విజయ్ కథానాయకుడిగా ఆయన చివరి యూవీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ `జన నాయగన్`ని నిర్మించింది. దీన్ని జనవరి 9న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది. కానీ సెన్సార్ వివాదం కారణంగా సినిమా పోస్ట్ పోన్ కావడం, కేసు మద్రాస్ హైకోర్టు వరకు వెళ్లడంతో మేకర్స్ కొంత ఇబ్బందికి లోనయ్యారు.
దళపతి విజయ్‌కి ఈ మూవీ ఫేర్‌వెల్ ఫిల్మ్ అవ్వాలని శతవిధాల ప్రయత్నించారు కానీ దాని వెనక రాజకీయ కోణం ఉండటంతో సినిమా రిలీజ్ మా చేతులు దాటిపోయిందని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అయితే ఇదే సమయంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా `టాక్సిక్` వంటి పాన్ ఇండియా మూవీని ఇదే కేవీఎన్ ప్రొడక్షన్స్ అదినేత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. ఆయతో కలిసి హీరో యష్ కూడా ఈ మూవీకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు.
గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 19న బారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. `జన నాయగన్` విషయంలో తీవ్ర ఆవేదనకు గురైన నిర్మాత వెంకట్ కె. నారాయణ `టాక్సిక్` విషయంలో మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారట. `జన నాయగన్` బడ్జెట్ రూ.300 కోట్లు. సినిమా రిలీజ్ ఆలస్యం అవుటుందడంతో బిజినెస్ పరంగా అంత పెద్ద మొత్తం బ్లాక్ అయిపోయింది. అయితే యష్ నటించిన `టాక్సిక్` పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. దీనికి ప్రధాన కారణం హీరో యష్ కావడంతో మేకర్స్ ఆనందంగా ఉన్నారట.
విషయం ఏంటంటే భారీ స్థాయిలో ఓ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా నిర్మాణం పరంగా బడ్జెట్ అంచనాలు దాటిపోయిందట. అయితే ఆ విషయం తెలుసుకున్న యష్ తన రెమ్యునరేషన్‌ని వదులుకుని సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారట. లాభాల్లో వాటా పద్దతిలో ఈ మూవీకి యష్ భాగస్వామిగా వ్యవహరిస్తుండటంతో నిర్మాత వెంకట్ కె. నారాయణ చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడని తెలిసింది. ఈ పద్దతిని స్టార్ హీరోలు మాత్రమే గత కొంత కాలంగా పాటిస్తున్నారు. షారుక్ ఖాన్, చిరంజీవి వంటి వారు మాత్రమే సినిమా లాభాల్లో వాటాల రూపంలో పారితోషికాలని తీసుకుంటున్నారు.
ఆ ఫార్ములాని `టాక్సిక్` మూవీకి యష్ ఫాలో అవుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏంటంటే దీనికి దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌తో కలిసి యష్ స్టోరీ అందించడం. దీంతో తన అభిమానులు ఆశించిన ఆంశాలని చాలా వరకు ఇందులో యష్ పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే `కేజీఎఫ్ 2` తరువాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు, సినీ ప్రియులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల నుంచి భారీ డిమాండ్ ఉండటంతో బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టుగా ఇన్ సైడ్ టాక్.
