Begin typing your search above and press return to search.

భారీ ప్రాజెక్టులపై రూమర్లు.. KVN సంస్థ ఏం చెప్పిందంటే?

తాజా ప్రకటనలో, తమ నిర్మాణంలో ఉన్న ప్రతి సినిమా కూడా యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.

By:  M Prashanth   |   15 March 2026 3:33 PM IST
భారీ ప్రాజెక్టులపై రూమర్లు.. KVN సంస్థ ఏం చెప్పిందంటే?
X

ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ కు సంబంధించిన ప్రాజెక్టులపై అనేక ఊహాగానాలు కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఆ బ్యానర్ నుంచి రానున్న ఫ్యూచర్ మూవీస్ నిలిచిపోయాయా? ఆ సినిమాలు ఆగిపోయాయా? అనే సందేహాలు సినీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. అయితే ఆ వార్తలపై తాజాగా నిర్మాణ సంస్థ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ టీమ్ అధికారిక ప్రకటనలో, తమ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ప్రచారంలో ఉన్న పుకార్లను పూర్తిగా ఖండించింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను దయచేసి పట్టించుకోవద్దని కోరింది. తమకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు కూడా ముందుగా ప్లాన్ చేసినట్టుగానే కొనసాగుతున్నాయని టీమ్ పేర్కొంది.

ఇటీవల కొన్ని ఆ సంస్థ నిర్మాణంలో ఉన్న సినిమాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల కారణంగా ప్రాజెక్టులు నిలిచిపోయాయని, కొంత ఆలస్యం జరిగిందని కొన్ని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అభిమానులు, సినీ ప్రియులు ఆ విషయంపై ఆసక్తిగా చర్చించాయి. అయితే ఆ పుకార్లకు తెరదించేందుకు కేవీఎన్ ప్రొడక్షన్స్ టీమ్ ముందుకొచ్చింది.

తాజా ప్రకటనలో, తమ నిర్మాణంలో ఉన్న ప్రతి సినిమా కూడా యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల డెవలప్మెంట్ పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపింది. అలాగే త్వరలో తమ సినిమాలకు సంబంధించిన అధికారిక అప్డేట్లు వరుసగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రాబోయే రోజుల్లో పవర్ ఫుల్ ప్రాజెక్టుల లైనప్‌ ను ప్రకటించబోతున్నామని వెల్లడించింది.

ఇదిలా ఉండగా, ఆ నిర్మాణ సంస్థ గతంలో ప్రకటించిన కొన్ని భారీ ప్రాజెక్టులు సినీ అభిమానుల్లో మంచి ఆసక్తి రేకెత్తించాయి. ప్రముఖ హీరోలు, స్టార్ డైరెక్టర్లతో కలిసి సినిమాలు చేయనున్నట్లు అప్పట్లో అఫీషియల్ గా ప్రకటించడం వల్ల ఆ ప్రాజెక్టులపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఇటీవల వచ్చిన పుకార్లు అభిమానుల్లో కొంత అనుమానాన్ని కలిగించాయి.

అయితే ఇప్పుడు టీమ్ ఇచ్చిన క్లారిటీతో ఆ డౌట్స్ కు చాలా వరకు ముగింపు లభించినట్టైంది. ముఖ్యంగా పవర్‌ ఫుల్ లైనప్ త్వరలో వస్తుందనే వ్యాఖ్యలతో సంస్థ నుంచి వచ్చే కొత్త ప్రకటనలపై ఆసక్తి మరింత పెరిగింది. కాగా, సినీ ఇండస్ట్రీలో పెద్ద ప్రాజెక్టుల విషయంలో పుకార్లు రావడం కొత్త విషయం కాదు. షూటింగ్ ఆలస్యం, రిలీజ్ డేట్ మార్పులు లేదా అధికారిక ప్రకటనలు ఆలస్యమైతే సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తుంటాయి. కానీ టీమ్ స్పందించినప్పుడు అసలు విషయాలు బయట పడతాయి. ఏదేమైనా కేవీఎన్ ప్రొడక్షన్స్ తమ ఫ్యూచర్ ప్రాజెక్టులపై పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.