Begin typing your search above and press return to search.

పక్కా ప్లాన్ తోనే KVN.. టార్గెట్ రీచ్ అవుతుందా?

అందులో ముఖ్యంగా జన నాయగన్, టాక్సిక్, మెగా 158 వంటి చిత్రాలు ఉన్నాయి. విజయ్, యష్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో ప్రాజెక్టులు ఉండటంతో ఆ బ్యానర్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  M Prashanth   |   19 May 2026 10:57 AM IST
పక్కా ప్లాన్ తోనే KVN.. టార్గెట్ రీచ్ అవుతుందా?
X

ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారింది. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తూ, స్టార్ హీరోలతో వరుస ప్రాజెక్టులు ప్రకటిస్తూ ఆ సంస్థ వేగంగా ఎదుగుతుందని చెప్పాలి. అయితే రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన కేడీ ది డెవిల్ మూవీ రిజల్ట్ మాత్రం కేవీఎన్‌ బ్యానర్ కు కొంత నిరాశ కలిగించిందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.

వెంకట్ కె. నారాయణ, నిషా వెంకట్ కొనంకిలు 2020లో ఆ బ్యానర్‌ ను స్ట్రాట్ చేశారు. మొదట కన్నడ సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆ సంస్థ, ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. సకత్, బైటూ లవ్ వంటి సినిమాలతో నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన కేవీఎన్, తర్వాత డిస్ట్రిబ్యూషన్‌ లో ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.

ముఖ్యంగా కర్ణాటకలో అనేక పాన్ ఇండియా చిత్రాల విడుదలలో ఆ సంస్థ కీలక పాత్ర పోషించింది. ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ, యానిమల్, దేవర పార్ట్ 1, కంగువ, తంగలాన్ వంటి భారీ సినిమాలను పంపిణీ చేసి మార్కెట్‌ లో స్ట్రాంగ్ నెట్‌ వర్క్ ఏర్పరుచుకుంది. దీంతో కేవీఎన్ పేరు సౌత్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపించడం ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ఆ బ్యానర్ బిగ్ టార్గెట్ ఏంటో అందరికీ తెలిసిందే.

కేవలం డిస్ట్రిబ్యూషన్ కాకుండా, నేరుగా పాన్ ఇండియా మార్కెట్‌ ను టార్గెట్ చేస్తూ భారీ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. అందులో ముఖ్యంగా జన నాయగన్, టాక్సిక్, మెగా 158 వంటి చిత్రాలు ఉన్నాయి. విజయ్, యష్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో ప్రాజెక్టులు ఉండటంతో ఆ బ్యానర్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రెండు వారాల క్రితం విడుదలైన కేడీ ది డెవిల్ మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయిందనే చర్చ జరుగుతోంది.

ధ్రువ సర్జా హీరోగా నటించిన ఆ యాక్షన్ డ్రామాలో సంజయ్ దత్, శిల్పా శెట్టి కీలక పాత్రల్లో కనిపించగా, సుదీప్ స్పెషల్ క్యామియో రోల్ పోషించారు. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన ఆ సినిమా మొదట కన్నడలో విడుదలై, తర్వాత తెలుగు డబ్బింగ్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ రెండు భాషల్లోనూ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు మార్కెట్‌ లో సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. భారీ యాక్షన్, స్టార్ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ కంటెంట్ కనెక్ట్ కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆ సినిమా పాన్ ఇండియా మూవీ కాకపోయినా.. తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ అయింది. రిజల్ట్ తో కేవీఎన్ సంస్థకు మాత్రం నిరాశపరిచింది. కానీ ఇప్పుడు బ్యానర్ లైనప్‌ లో ఉన్న సినిమాలకు పాన్ ఇండియా బజ్ ఉంది. ముఖ్యంగా యశ్ టాక్సిక్, విజయ్ జన నాయగన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే చిరంజీవి- బాబీ కాంబోలో తెరకెక్కనున్న మెగా 158 కూడా మాస్ మార్కెట్‌ ను టార్గెట్ చేస్తోంది. మొత్తంగా చూస్తే డెవిల్ తో ఎదురుదెబ్బ తగిలినా, కేవీఎన్ ప్రొడక్షన్స్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో టాప్ బ్యానర్‌ గా నిలవాలనే లక్ష్యంతో పక్కా ప్లాన్‌ తో ముందుకెళ్తోందనే చెప్పాలి.