Begin typing your search above and press return to search.

పంచ్ లతో నవ్వించే అనుదీప్ లో ఇంత వ్యక్తిత్వమా.. హ్యాట్సాఫ్ గురూ!

ఇంటర్వ్యూలో భాగంగా కె.వి అనుదీప్.. కెవి ఫుల్ ఫామ్ ఏంటి? ఇది మీ ఇంటి పేరా?అని యాంకర్ ప్రశ్నించగా.. మా ఇంటి పేరు డీ.. తరిగుంట.

By:  Madhu Reddy   |   13 Feb 2026 10:55 AM IST
పంచ్ లతో నవ్వించే అనుదీప్ లో ఇంత వ్యక్తిత్వమా.. హ్యాట్సాఫ్ గురూ!
X

సాధారణంగా మనిషి జన్మించిన తర్వాత నామకరణం పెడతాం. అయితే పెళ్లి కానంతవరకు అమ్మాయికి తండ్రి తరఫు ఇంటిపేరు వస్తుంది. అదే వివాహం జరిగితే అత్తింటి వారి ఇంటి పేరును ఆమె ఇంటిపేరుగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక అబ్బాయికైతే జీవితాంతం తండ్రి తరఫు వారసత్వంగా ఆ ఇంటి పేరుని కొనసాగిస్తారు. అయితే మనకు జన్మనిచ్చిన తల్లికి ఎందుకు విలువనివ్వము? తల్లి ఇంటి పేరును ఎందుకు మన ఇంటి పేరుగా పెట్టుకోము ?అనే కామెంట్లు ఫెమినిస్టులలో వినిపిస్తూనే ఉంటాయి. అయితే సాంప్రదాయంగా వస్తోంది ఇదే అని.. తండ్రి వారసత్వాన్ని కొడుకు కొనసాగిస్తాడని.. అందుకే తండ్రి ఇంటి పేరును కొడుకు తన ఇంటి పేరుగా పెట్టుకొని ఆ వారసత్వాన్ని అలాగే కొనసాగిస్తారన్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు తండ్రి పేరుతో పాటు తల్లి పేరుని కూడా తన ఇంటి పేరుగా మార్చుకొని అందరిని ఆశ్చర్యపరిచారు ఒక స్టార్ డైరెక్టర్. పైకి అమాయకంగా కనిపిస్తూ.. తన పంచ్ డైలాగులతో అందరినీ నవ్వించే ఈ డైరెక్టర్ వ్యక్తిత్వం గురించి తెలిసి ఒక్క సినీ ఇండస్ట్రీనే కాదు యావత్ అభిమానులు, సినీ ప్రేక్షకులు, నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఆయన గొప్ప మనసుకి దాసోహం అంటున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

'జాతిరత్నాలు' సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు కేవీ అనుదీప్. చూడడానికి చాలా అమాయకంగా కనిపించినా.. ఆయన పంచ్ డైలాగ్ లకు పొట్ట చెక్కలు అవ్వాల్సిందే. అంతలా నవ్వించే అనుదీప్ తన దర్శకత్వ విలువలతో స్క్రీన్ పై అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తారు. అలాంటి ఈయన ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా, ఖయాదు లోహర్ హీరోయిన్గా ఫంకీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన అనగా నేడు థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్న కె.వి అనుదీప్ తన ఇంటి పేరు వెనుక ఉన్న అసలు విషయాన్నీ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

ఇంటర్వ్యూలో భాగంగా కె.వి అనుదీప్.. కెవి ఫుల్ ఫామ్ ఏంటి? ఇది మీ ఇంటి పేరా?అని యాంకర్ ప్రశ్నించగా.. మా ఇంటి పేరు డీ.. తరిగుంట. అయితే ఇంటిపేరులో ఫాదర్ ఇంటిపేరు మాత్రమే ఉంటుంది. తల్లి ఇంటిపేరు ఉండదు. అందుకే కే అంటే కాశీ , వీ అంటే విశ్వనాథ్.. అలా ఇంటిపేర్లు కాకుండా మా అమ్మ నాన్న పేర్లను ఇనిషియల్ గా పెట్టుకున్నాను అంటూ అనుదీప్ చెప్పుకొచ్చారు.

పుట్టినప్పటి నుండి ఈ పేరు పెట్టుకున్నారా? లేక మధ్యలో మార్చుకున్నారా అనే ప్రశ్నకు అనుదీప్ మాట్లాడుతూ.. "సొంత ఊరు ఏదంటే నాన్న వాళ్ళ ఊరి పేరు చెప్పాలి. ఇన్షియల్ కూడా నాన్న నుంచి వస్తుంది. అయితే నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే చాలా ఇష్టం. సొంత ఊరు ఏది అంటే నేను అదే చెప్పే వాడిని.. కాకపోతే అలా చెప్పకూడదు నాన్న వాళ్ళ ఊరి పేరే చెప్పాలి అనేవాళ్లు. ఎందుకు అని ఆలోచించాను. ఆ తర్వాత కొన్ని ఫెమినిజం పుస్తకాలు కూడా చదివాను. అమ్మను ఎక్కువ అవాయిడ్ చేస్తున్నామని చెప్పి.. నా ఇంటిపేరుగా అమ్మ, నాన్న పేర్లను పెట్టుకున్నాను.

నేను రంగనాయకమ్మ బుక్స్ బాగా చదువుతాను. ఆ పుస్తకాలలో ఫెమినిజం గురించి చాలా లోతుగా ఉంటుంది. ఆమె పుస్తకాలలో ఇలా ఇంటిపేర్ల గురించి మార్చుకున్న వాళ్ల గురించి కూడా చాలా ఉంది. అందుకే నేను కూడా అలా మార్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి అనుదీప్ తన తల్లికి ఇచ్చిన విలువ గురించి, ఆడవారికి ఇచ్చే గౌరవం గురించి తెలుసుకొని ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.