మొదటి ముద్దైనా..హగ్ అయినా మొగుడికే!
లిప్ లాక్ లు..ఇంటిమేట్ సన్నివేశాలంటే? వాటిలో నటించడానికి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు.
By: Srikanth Kontham | 11 Dec 2025 11:00 PM ISTలిప్ లాక్ లు..ఇంటిమేట్ సన్నివేశాలంటే? వాటిలో నటించడానికి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. దర్శకుడి విజన్ మేరకు నో చెప్పకుండా పని చేస్తున్నారు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా? చిన్న హీరోయిన్ అయినా? అలాంటి సన్నివేశాల్లో ఎంత మాత్రం మొహమాట పడకుండా నటిస్తున్నారు. కెరీర్ ఆరంభంలో నో చెప్పినా? కాల క్రమంలో వాళ్లలోనూ మార్పులొస్తున్నాయి. గ్లామర్ పాత్రలకు సై అంటూ ముందుకొస్తున్నారు. ప్రముఖంగా ఒకప్పుడు తెలుగు నటీమణులు గ్లామర్ పాత్రలంటే ముందుకొచ్చే వారు కాదు. ఒకవేళ వచ్చినా షైతో పనిచేసేవారు.
ఓ కేసుతో పాపులర్:
కానీ కొంత కాలంగా వారు కూడా ముంబై భామలకు ధీటుగా నటిస్తున్నారు. తాజాగా మరో తెలుగు నటి ఖుషిత కల్లపు మాత్రం ఆ తరహా పాత్రలకు దూరమంటూ ప్రకటించింది. `చాంగురే బంగారు రాజా`, `నీతోనే`, `బాబు నెంబర్ వన్ బుల్షిట్ గయ్` లాంటి చిత్రాల్లో కుషిత నటించింది. యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కుషిత ఓ సంచలన కేసుతో నెట్టింట పాపులర్ అయింది. సినిమాలను మించిన ఫాలోయింగ్ ఆ కేసు తెచ్చి పెట్టింది. దీంతో సామాజిక మాధ్యమాల్లోనూ పాపులారిటీ పెరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ సీన్స్ చేయాల్సి వస్తే చేస్తారా?
అక్కడ నార్త్..ఇక్కడ సౌత్
అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. `లిప్ కిస్ అయితే పెట్టను. ఇష్టముండదు. ఇంటిలోనూ ఒప్పుకోరు. ఇంటిమేట్ సీన్స్ కూడా కొంతవరకే. తృప్తి డిమ్రీ కూడా కెరీర్ ఆరంభంలో మీలాగే మాట్లాడింది? కానీ ఆమె కూడా `యానిమల్` సినిమాలో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించింది. ఆ సినిమాతో ఎంతో పాపులర్ అయింది కదా? అనగా `అక్కడ నార్త్..ఇక్కడ సౌత్` అంటూ బధులిచ్చింది. `నేను పెళ్లి చేసుకోవాలి. నా మొదటి ముద్దు అయినా..హగ్ అయినా నా భర్తకు మాత్రమే.
ఊహించుకున్న విధంగా కెరీర్ ఉండేనా:
ఈ విషయంలో రాజీ పడేదిలేదు. సినిమా అవకాశాల కోసం ఎలా పడితే అలా నటించాలనే ఆలోచన తనకు లేదని తెలిపింది. మరి ఇంతటి కఠిన నిర్ణయాలు కలిగిన కుషితకు టాలీవుడ్ లో తాను కోరుకున్న అవకాశాలు వస్తాయా? లేదా? అన్నది చూడాలి. ఇప్పటికే అమ్మడు ఇన్ స్టా గ్రామ్ వంటి మాధ్యమాల్లో పాపులర్ అయింది. చీరందంలో ముస్తాబైన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అలాగే సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన `గుంటూరు కారం`లోనూ నటించినట్లు వార్తలొచ్చాయి. ఆమె కూడా ఈ ప్రచారాన్ని ధృవీకరించింది. కానీ సినిమాలో ఆమె పాత్ర లేదు. బహుశా నిడివి కారణంగా ఆ పాత్రను డిలీట్ చేసి ఉండొచ్చు. నటిగా ఫేమస్ అయితే? ఇలాంటి కోతలకు అవకాశం ఉండదు కదా? అన్న విషయాన్ని నెటి జనులు గుర్తు చేస్తున్నారు.
