మినీ డ్రెస్ లో కుషిత అందాలు.. డైట్ సీక్రెట్ రివీల్!
సెలబ్రిటీలకు, సినీ ప్రేక్షకులకు మధ్య వారధిలా వ్యవహరిస్తున్న సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
By: Madhu Reddy | 19 May 2026 10:19 AM ISTసెలబ్రిటీలకు, సినీ ప్రేక్షకులకు మధ్య వారధిలా వ్యవహరిస్తున్న సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచం నలుమూలల జరిగే ఏ విషయమైనా సరే క్షణాలలో చేరవేసే ఈ సోషల్ మీడియా.. సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులకు చేరవేయడంలో ముందుంటుంది. ఇక అందులో భాగంగానే సెలబ్రిటీలు కూడా అభిమానులకు మరింత చేరువ అవ్వడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
సోషల్ మీడియా పేజీలైన ఎక్స్, ఇంస్టాగ్రామ్ ద్వారా తమకు సంబంధించిన ప్రతి విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా మనకు తెలియని ఎన్నో విషయాలను దీని ద్వారా షేర్ చేస్తున్నారు. అటు అందాలతో ఆకట్టుకోవడమే కాకుండా ఇటు డైలీ రొటీన్ విషయాలను కూడా షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక బ్యూటీ.. ప్రతిరోజు తాను ఏం చేస్తుంది? ఏం తింటుంది అనే విషయాలను నెటిజన్స్ తో పంచుకోవడమే కాకుండా తన గ్లామర్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
ఆమె ఎవరో కాదు కుషిత కల్లపు.. సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన ఈమె నిత్యం ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అందులో భాగంగానే తాజాగా మరోసారి ఇంస్టాగ్రామ్ ద్వారా పలు ఫోటోలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కుషిత. తాజాగా ఉదయం లేవగానే తన పెట్ డాగ్ పై ఆప్యాయంగా ప్రేమను కురిపించిన ఈమె.. ఆ తర్వాత తన బ్రేక్ ఫాస్ట్ లో ఏం తింటుంది అనే విషయాలను పంచుకుంది. అలాగే లంచ్, డిన్నర్ ఇలా తాను తీసుకునే తనకు ఇష్టమైన ఆహారాలను షేర్ చేసిన ఈమె హోమంలో పాల్గొన్న వీడియోని కూడా అభిమానులతో షేర్ చేసింది.
ఇక అలాగే మిర్రర్ ముందు సెల్ఫీ ఫోజులిస్తూ షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.. డాల్ ను తలపించేలా.. బ్యాక్ అందాలను షేర్ చేస్తూ చాలా క్యూట్ గా సెల్ఫీ ఫోటో దిగి దానిని షేర్ చేసింది. ఇక మొత్తానికైతే అందాల డోస్ పెంచి కుషిత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇక అమ్మడి అందానికి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. కొంతమంది అయితే ఈమె షేర్ చేసిన ఫుడ్ మెనూ చూసి ఈ అందం వెనుక ఉన్న డైట్ సీక్రెట్ అదేనా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
కుషిత విషయానికి వస్తే 3 రోజెస్ సీజన్ 2 లో నటించిన ఈమె ప్రస్తుతం పలు సినిమాలు , వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ అందులో అందాలు ఆరబోస్తోంది. నీతోనే నేను అనే చిత్రం ద్వారా 2023లో ఇండస్ట్రీకి పరిచయమైన కుషిత.. చాంగురే బంగారు రాజా, మనోహరం , చిరంజీవ , 3 రోజెస్ వంటి చిత్రాలు, సీరీస్ లో నటించి ప్రేక్షకులకు దగ్గరయింది. నటిగా కెరియర్ ను ప్రారంభించక ముందు మోడల్గా , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారిన ఈమె.. 2002 అక్టోబర్లో హైదరాబాదులో జన్మించింది . యూట్యూబ్ , టిక్ టాక్ రీల్స్ తో పాపులారిటీ సంపాదించుకున్న తర్వాతే సినిమా రంగంలోకి అడుగు పెట్టింది కుషిత.
