Begin typing your search above and press return to search.

మెసేజ్‌లు పెట్టేవాడు.. మాట మార్చిన న‌టి!

తాజాగా దీనిపై ఖుషీ వివ‌ర‌ణ ఇచ్చారు. తాను, సూర్య కుమార్ కేవ‌లం మంచి స్నేహితులం మాత్ర‌మేన‌ని అన్నారు. మేం స్నేహితుల్లా మాట్లాడుకోకూడ‌దా? అని కూడా అన్నారు.

By:  Sivaji Kontham   |   1 Jan 2026 4:00 AM IST
మెసేజ్‌లు పెట్టేవాడు.. మాట మార్చిన న‌టి!
X

టీమిండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ త‌న‌కు మెసేజ్‌లు చేసేవాడంటూ హిందీ మూవీ టీవీ న‌టి ఖుషి ముఖ‌ర్జీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాను ఎవ‌రితోను డేటింగ్ చేయ‌లేద‌ని, లింకప్‌లు లేవ‌ని అన్నారు. అయితే సూర్య కుమార్ యాదవ్ పై ఖుషీ వ్యాఖ్య‌ల‌కు స్పందించిన కొంద‌రు ఆమెను తీవ్రంగా దూషించారు.

తాజాగా దీనిపై ఖుషీ వివ‌ర‌ణ ఇచ్చారు. తాను, సూర్య కుమార్ కేవ‌లం మంచి స్నేహితులం మాత్ర‌మేన‌ని అన్నారు. మేం స్నేహితుల్లా మాట్లాడుకోకూడ‌దా? అని కూడా అన్నారు. కేవలం ఒకటిన్నర నెలల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సూర్యకుమార్ కెప్టెన్సీలో భారత జట్టును ఇప్పటికే ప్రకటించిన తరుణంలో అంత‌గా ప్రాముఖ్య‌త లేని న‌టి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో, ఆ వ్యాక్య‌లు టీమిండియా జట్టు వాతావరణానికి హానికరంగా భావించారు. ఇటువంటి వివాదాలు ఆటాడే టీమ్ మనోధైర్యానికి, మాన‌సిక ఆరోగ్యానికి నష్టం కలిగించగలవు.. అని చాలామంది ముఖ‌ర్జీని త‌ప్పు ప‌డుతున్నారు.

తామిద్ద‌రూ స్నేహితులే అనే విష‌యం ఆ స‌మ‌యంలో చెప్పి ఉంటే, ఇలాంటి దుమారం చెల‌రేగేది కాద‌ని కూడా ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 2025లో భారత్‌కు ఆసియా కప్ టైటిల్‌ను అందించినప్పటికీ, బ్యాటింగ్‌లో ఇటీవ‌ల‌ ఫామ్ క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. దానికి తోడు ఖుషీ ముఖర్జీ చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఆసక్తికరంగా అదే రోజు సూర్యకుమార్ తన భార్య దేవిషాతో కలిసి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తున్న సమయంలోనే ఖుషీ ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ విషయంపై ఆ క్రికెటర్ ఇంకా స్పందించలేదు.