'కుమారి 22F' బోల్డ్ టర్న్.. ఆపోజిట్ జానర్‌లోనా?
ఇప్పుడు, ఇన్నేళ్ల తర్వాత, ఆ ఫ్రాంచైజీ నుంచి 'కుమారి 22F' వస్తుందనే న్యూస్ బయటకు వచ్చింది.
By: M Prashanth | 27 Oct 2025 8:56 AM ISTపదేళ్ల క్రితం టాలీవుడ్‌లో ఒక చిన్న సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే 'కుమారి 21F'. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, అప్పట్లో ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. దర్శకుడు సూర్య ప్రతాప్ అయినప్పటికీ సుకుమార్ అందించిన బోల్డ్ రైటింగ్ కు మంచి క్రేజ్ దక్కింది. తెలుగు సినిమా రొటీన్ ప్రేమకథలకు భిన్నంగా, చాలా రియలిస్టిక్‌గా ఉండటంతో యూత్‌కు బాగానే కనెక్ట్ అయింది. ఆ ఒక్క సినిమాతో హెబ్బా పటేల్ రేంజ్ మారిపోయింది.
ఇప్పుడు, ఇన్నేళ్ల తర్వాత, ఆ ఫ్రాంచైజీ నుంచి 'కుమారి 22F' వస్తుందనే న్యూస్ బయటకు వచ్చింది. ఈసారి ఈ సినిమాతో సుకుమార్ సతీమణి, తబితా సుకుమార్, ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. 'తబితా సుకుమార్ ఫిల్మ్స్' బ్యానర్‌పై ఇది ఫస్ట్ ప్రొడక్షన్. ఈ న్యూస్ వినగానే, 'కుమారి 21F' ఫ్యాన్స్ అందరూ ఈసారి డోస్ డబుల్ ఉంటుందని, ఇంకెంత బోల్డ్‌గా ఉంటుందో అని ఫిక్స్ అయిపోయారు.
అయితే, ఇక్కడే ఇండస్ట్రీ వర్గాల్లో ఒక షాకింగ్ 'గాసిప్' చక్కర్లు కొడుతోంది. ఈ గాసిప్ విన్నవాళ్లు "అసలు ఇది సాధ్యమేనా?" అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం, 'కుమారి 22F' సినిమా.. ఫస్ట్ పార్ట్‌కు పూర్తి ఆపోజిట్ జానర్‌లో ఉండబోతోందట. ఇది 'కుమారి 21F' లాంటి బోల్డ్ రొమాన్స్ కాదని, దానికి పూర్తి భిన్నంగా ఒక 'స్పిరిచువల్ రొమాన్స్' (ఆధ్యాత్మిక ప్రేమకథ) అని అంటున్నారు.
ఈ పుకారు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 'కుమారి' లాంటి బ్రాండ్‌కు, 'స్పిరిచువల్' అనే పదానికి అస్సలు సింక్ అవ్వడం లేదు. ఒకటి ఫుల్లుగా ఫిజికల్ అట్రాక్షన్, లస్ట్ చుట్టూ తిరిగితే.. ఇంకొకటి పూర్తి భిన్నమైన దైవత్వం, ఆత్మల చుట్టూ తిరుగుతుందా అనే ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. ఇది నిజమైతే అసలు ఈ రెండు జానర్లను కలిపి "కుమారి" బ్రాండ్ కింద ఎలా తీస్తారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇది చాలా వింత కాంబినేషన్.
అయితే, ఈ గాసిప్ వెనుక ఏదైనా లాజిక్ ఉందా అని ఆలోచిస్తే.. ఇది తబితా సుకుమార్ ఫస్ట్ ప్రొడక్షన్ కావడంతో, ఆమె కాంట్రవర్సీలకు దూరంగా, ఒక క్లీన్, మీనింగ్‌ఫుల్ సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టాలని అనుకుంటున్నారేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది. లేదా, "కుమారి" అనే బోల్డ్ టైటిల్ పెట్టి, లోపల స్పిరిచువల్ కంటెంట్ పెట్టి సుకుమార్ స్టైల్‌లో ఆడియెన్స్‌కు షాక్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇదంతా గట్టిగా వినిపిస్తున్న ఒక 'బజ్' మాత్రమే. ఇందులో నిజమెంతో తెలియాలి అంటే మరో అప్డేట్ వచ్చే వరకు ఆగాల్సిందే.
