Begin typing your search above and press return to search.

Krrish బ్రాండ్ కాపాడగలడా? హృతిక్ ముందు భారీ ఛాలెంజ్!

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్ కెరీర్‌లో అత్యంత కీలకంగా భావించిన క్రిష్4 ప్రాజెక్ట్ ప్రస్తుతం డిలే అవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   21 April 2026 7:00 PM IST
Krrish బ్రాండ్ కాపాడగలడా? హృతిక్ ముందు భారీ ఛాలెంజ్!
X

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్ కెరీర్‌లో అత్యంత కీలకంగా భావించిన క్రిష్4 ప్రాజెక్ట్ ప్రస్తుతం డిలే అవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. భారీ అంచనాలతో ముందుకు సాగాల్సిన ఈ సినిమా బడ్జెట్ పరిమితుల కారణంగా నిలిచిపోవడం, హృతిక్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ప్రధాన చర్చగా మారింది. ఒక స్టార్ హీరోకు లాంగ్ గ్యాప్ అనేది ఎప్పుడూ రిస్క్‌గా పరిగణించబడుతుంది. ముఖ్యంగా సూపర్ హీరో ఫ్రాంచైజ్ వంటి భారీ ప్రాజెక్ట్ ఆగిపోతే, ఆ స్టార్ మార్కెట్ మీద నెగెటివ్ సిగ్నల్స్ వెళ్లే అవకాశం ఉంది. దానికి తోడు హృతిక్ ఆఖ‌రి సినిమాలు ఫైట‌ర్, వార్2 అంచనాల మేర భారీ వసూళ్లు సాధించకపోవడం కూడా మైన‌స్ గా మారింది.

ఇక క్రిష్4 విషయంలో మరో ముఖ్య అంశం బడ్జెట్. ఇండియన్ మార్కెట్ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల విషయంలో చాలా లెక్కచేసే దశలో ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్లోబల్ స్టాండర్డ్స్‌ను అందుకోవాలంటే అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు అవసరం అవుతున్నాయి. అందుకే హృతిక్, అతని తండ్రి రాకేష్ రోష‌న్ కలిసి క్రిష్4 కోసం ఇంటర్నేషనల్ స్టూడియోల‌ కోసం ప్రయత్నిస్తున్నారు. హాలీవుడ్ తరహా కోలాబరేషన్ ద్వారా ప్రాజెక్ట్‌ను గ్లోబల్ లెవెల్‌లో నిలబెట్టాలని వారి ప్లాన్. అయితే ఈ ప్రయత్నాలే ప్రాజెక్ట్ డిలేకు ఒక కారణంగా మారాయని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, హృతిక్ స్వయంగా డైరెక్షన్ బాధ్యతలు తీసుకోవాలనుకోవడం కూడా ప్రీ ప్రొడక్షన్ దశను మరింత ఆల‌స్యం చేసిన‌ అంశంగా కనిపిస్తోంది.

ఇక క్రిష్ ఫ్రాంచైజ్ విషయానికి వస్తే, ఇది ఒకప్పుడు ఇండియన్ సూపర్ హీరో జానర్‌కు బెంచ్‌మార్క్‌గా నిలిచింది. క్రిష్ బ్రాండ్‌కు ఇప్పటికీ మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పూర్తిగా మారిపోయాయి. హాలీవుడ్ స్థాయి విజువల్స్, కంటెంట్ లేకపోతే ఈ జానర్ సినిమాలు సక్సెస్ కావడం కష్టమనే అభిప్రాయం పెరిగింది. ఈ నేపథ్యంలో క్రిష్4 డిలే అవ్వడం మొత్తం సూపర్ హీరో జానర్‌కే ఒక చిన్న షాక్‌గా భావించవచ్చు. మరోవైపు, హృతిక్ ఇప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ ఏదీ సైన్ చేయకపోవడం కూడా అతని కెరీర్ స్ట్రాటజీపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సరైన స్క్రిప్ట్ కోసం వేచి ఉండటం ఒక వైపు ప్లస్ అయితే, ఎక్కువ గ్యాప్ తీసుకోవడం మార్కెట్‌ను ప్రభావితం చేసే మైనస్‌గా మారే అవకాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో ప్రస్తుతం హృతిక్ కెరీర్ ఒక కీలక మలుపులో ఉందని చెప్పాలి. తదుపరి సినిమా సక్సెస్ అయితే అతను మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వగలడు. లేదంటే ఈ గ్యాప్, ఇటీవల ఫలితాల ప్రభావం కలిసి కెరీర్ వేగాన్ని తగ్గించే ప్రమాదం ఉంది. అదే సమయంలో, బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నిర్మాతలు ఇప్పుడు రిస్క్ తీసుకోవడంలో జాగ్రత్త పడుతూ, బడ్జెట్ కంట్రోల్‌పై దృష్టి పెడుతున్నారు. ఈ పరిణామాలన్నింటి మధ్య కృష్4 భవిష్యత్తు, అలాగే హృతిక్ రోషన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ఇండస్ట్రీ మొత్తానికి ఆసక్తికరంగా మారింది.