అతడితో రిలేషన్ షిప్ అందుకే సీక్రెట్ గా!
బాలీవుడ్ నటి కృతికా కమ్రా కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో సరికొత్త పంథాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.
By: Srikanth Kontham | 23 April 2026 10:50 PM ISTబాలీవుడ్ నటి కృతికా కమ్రా కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో సరికొత్త పంథాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. క్రికెట్ ప్రజెంటర్, నటుడు గౌరవ్ కపూర్‌తో ఉన్న రిలేషన్ షిప్ గురించి చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ వాటి గురించి అమ్మడు ఏ రోజు ఓపెన్ అవ్వలేదు. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంట ర్వ్యూలో ఆ గుట్టు విప్పేసింది. గత అనుభవాల నుండి తాను నేర్చుకున్న పాఠాలే ఇందుకు కారణమని అమ్మడు అసలు విషయం చెప్పేసింది. గతంలో వ్యక్తిగత విషయాలు , ప్రేమ వ్యవహారాలు పబ్లిక్ డొమైన్‌లో ఉండటం వల్ల ఎదురైన పరిణామాలను కృతికా గుర్తు చేసుకుంది.
కెరీర్ ప్రారంభంలో రిలేషన్‌షిప్స్ గురించి అందరికీ తెలియడం వల్ల తన పని కంటే వ్యక్తిగత జీవితంపైనే ఎక్కువ చర్చ జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే ఈసారి బంధాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచుకోవాలని అనవ సరమైన మీడియా దృష్టి , పుకార్లకు తావు ఇవ్వకూడదని వ్యవహారమంతా గోప్యంగా ఉంచినట్లు వెల్లడించింది. నటిగా తన ప్రతిభను , సినిమాలను మాత్రమే ప్రేక్షకులు చర్చించుకోవాలని కృతిక కోరుకుంటుంది. తన జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులను, వారి ప్రైవేట్ స్పేస్‌ను గౌరవించడం బాధ్యతగా చెప్పుకొచ్చింది.
సెలబ్రిటీ హోదా ఉన్నా? ఇంటి గుమ్మం దాటిన తర్వాత ఉండే ప్రశాంతతను కాపాడుకోవడమే తన ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వచ్చే కామెంట్లు, విశ్లేషణలు ఒక్కోసారి మానసిక ఒత్తిడికి దారితీస్తాయని కృతికా అభిప్రా యపడింది. ప్రతి విషయాన్ని ప్రపంచంతో పంచుకోవాల్సిన అవసరం లేదని కొన్ని విషయాలను మనకు మాత్రమే పరిమితం చేసుకోవడంలోనే నిజమైన ఆనందం ఉంటుందన్నది బలంగా నమ్ముతానంది. గౌరవ్ - కృతిక తరచుగా కలిసి కనిపిస్తున్నా? వారి మౌనం వెనుక ఉన్న పరిణతిని అభిమానులు కూడా అర్థం చేసుకుంటున్నారు.
కృతికా కమ్రా వ్యక్తిగత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతంలో ఎదురైన చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రైవేట్ లైఫ్‌లో ఇతరుల జోక్యం లేకుండా ప్రశాంతంగా ప్లాన్ చేసుకుంది. నటిగా ఎదిగే క్రమంలో ఇలాంటి స్పష్టత ఉండటం వృత్తిపరమైన ఎదుగుదలకు కూడా ఎంతో సహాయపడుతుందని అమ్మడు విశ్వసిస్తుంది. ఇక కృతిక కెరీర్ విషయానికి వస్తే సినిమాల పరంగా ఇంకా పరిమితంగానే పని చేస్తోంది. ఇప్పటికీ సిరీస్ లు..టెలివిజన్ సీరియల్స్ తోనే బిజీగా ఉంది.
