నిన్న శ్రీలీల.. నేడు కృతి శెట్టి.. ఇద్దరికీ సేమ్..
అయితే మూవీ స్టోరీలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే సాదాసీదాగా ఉండటంతో సినిమా ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది.
By: M Prashanth | 23 Jan 2026 7:00 AM ISTసంక్రాంతి పండుగ వేళ విడుదలైన సినిమాలపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉంటాయి. అలాంటి టైమ్ లోనే యంగ్ బ్యూటీ కృతి శెట్టి తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె చేసిన కోలీవుడ్ డెబ్యూ మూవీ వా వాతియార్ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇదే పరిస్థితి కొద్ది రోజుల క్రితం మరో యంగ్ హీరోయిన్ శ్రీలీలకు కూడా ఎదురైంది. దీంతో ఇప్పుడు ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి టాలీవుడ్ లో ఉప్పెన మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన కృతి శెట్టి ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రీసెంట్ గా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కార్తీ హీరోగా నటించిన వా వాతియార్ మూవీలో లీడ్ రోల్ పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే మూవీ స్టోరీలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే సాదాసీదాగా ఉండటంతో సినిమా ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. కృతి శెట్టి యాక్టింగ్ గా పరంగా ఆకట్టుకున్నప్పటికీ.. ఆమె రోల్ కు సరైన ఇంపార్టెన్స్ లేకపోవడం మైనస్ గా మారింది. ఏదేమైనా మొదటి వీకెండ్ కే థియేటర్లలో కలెక్షన్లు తగ్గిపోయాయి. దీంతో డిజాస్టర్ మారిన వా వాతియార్ మూవీ.. కృతికి నిరాశ మిగిల్చింది.
అదే సమయంలో ఇటీవల శ్రీలీల నటించిన కోలీవుడ్ డెబ్యూ పరాశక్తి మూవీ కూడా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఆ సినిమా మంచి అంచనాల మధ్య రిలీజ్ అయినప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో శ్రీలీలకు నిరాశే ఎదురైంది. కృతి శెట్టికి కూడా అదే పరిస్థితి ఎదురవడంతో ఇద్దరికీ కోలీవుడ్ డెబ్యూలు కలిసి రాలేదని చెప్పాలి.
అయితే తెలుగు హీరోయిన్లకు తమిళంలో మొదటి సినిమాలు కలిసి రావా అనే ప్రశ్న వినిపించింది. కానీ దాన్ని పెద్దగా ఆందోళనగా తీసుకోవాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఒక్క సినిమా ఫలితంతోనే కెరీర్ ను అంచనా వేయడం సరికాదని, మంచి కథలు, బలమైన పాత్రలు దొరికితే తమిళంలో కూడా నిలదొక్కుకోవడం ఖాయమని చెబుతున్నారు.
సంక్రాంతి పోటీ, భారీ సినిమాల మధ్య విడుదల కావడం కూడా వారి చిత్రాలపై ప్రభావం ఎక్కువ చూపిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల మధ్య చిన్న, మీడియం సినిమాలకు స్క్రీన్లు దొరకడం కష్టమవుతుందని, దాని వల్ల కలెక్షన్లపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. మొత్తానికి తమిళ ఇండస్ట్రీలో తొలి ప్రయత్నంలో కృతి శెట్టికి నిరాశ తప్పలేదు. శ్రీలీల తర్వాత అదే దారిలో ఆమె కూడా తొలి అడుగులో తడబడిందని అనేక మంది అభిప్రాయం.
