Begin typing your search above and press return to search.

బ్రేక‌ప్ ప్ర‌చారంపై క్లారిటీ ఇచ్చేసిన జోడీ!

బాలీవుడ్ నటి కృతి సనన్ వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి క‌థ‌నాలు వైర‌ల్ అయినా? వాటి గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోరు.

By:  Srikanth Kontham   |   1 July 2026 10:53 PM IST
బ్రేక‌ప్ ప్ర‌చారంపై క్లారిటీ ఇచ్చేసిన జోడీ!
X

బాలీవుడ్ నటి కృతి సనన్ వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి క‌థ‌నాలు వైర‌ల్ అయినా? వాటి గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోరు. వీలైనంత వ‌ర‌కూ మౌనంగానే ఉంటారు. రాసేవ‌న్నీ నిజాలు కాన‌ప్పుడు వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం దేనిక‌నే పంథాలో ఉంటారు. అయితే ఇటీవల కృతిస‌న‌న్ డేటింగ్ చేస్తోందని ప్రచారంలో ఉన్న వ్యాపారవేత్త కబీర్ బాహియాతో బ్రేకప్ అయిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఓ ఫోటోలో కబీర్ మరొక మహిళతో కనిపించడంతో ఈ పుకార్లు మరింత బలపడ్డాయి. వీటిని పటాపంచలు చేస్తూ కృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కబీర్‌తో కలిసి ఉన్న ఓ ఆత్మీయ ఫోటోను షేర్ చేయడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

కృతి సనన్ మంగళవారం గడిచిన ఆరు నెలల జ్ఞాపకాలను ఒక ఫోటో డంప్ రూపంలో అభిమానులతో పంచు కున్నారు. అందులో ఆమె పెంపుడు కుక్కతో, సోదరి నూపుర్ సనన్‌తో కలిసి గడిపిన క్షణాలు, `కాక్‌టెయిల్ 2` సహనటి రష్మిక మందన్నాతో దిగిన ఫోటోలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ కబీర్ బాహియాతో కలిసి ఉన్న ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా కనిపిస్తుండగా కృతి క్యాజువల్ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. తాజాగా ఈ బ్రేకప్ వార్తలపై స్పందించిన కబీర్ సన్నిహిత వర్గాలు వైరల్ అవుతున్న ఆ ఫోటోను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశాయి.

కబీర్ పక్కన ఉన్న వ్యక్తి అతని కుటుంబ స్నేహితురాలని, ఆమెను అతను తన సొంత సోదరిలా భావిస్తాడని వివరించారు. నిజానిజాలు తెలియకుండానే ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని స‌న్నిహిత పేర్కొన్నాయి. ఈ వివ‌ర‌ణ‌తో కృతి - కబీర్ విడిపోయారనే వార్తలకు పుల్‌స్టాప్ పడినట్లేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రేమాయణం గురించి ఓ ఇంటర్వ్యూలో కృతిస‌న‌న్ స్పష్టంగా మాట్లాడారు. వివాహం చేసుకునే వరకు తన వ్యక్తిగత విషయాల గురించి బయటపెట్టడానికి ఇష్టపడనని తేల్చి చెప్పారు.

కొన్ని విషయాలు తనకి, తన సన్నిహితులకు మాత్రమే పరిమితం కావాలని కృతి అభిప్రాయపడ్డారు. పెళ్లి రోజున మాత్రమే తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతానని కృతి పేర్కొనడం గమనార్హం. ప్ర‌స్తుతం కృతి సనన్ `కాక్‌టెయిల్ 2` సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. హోమీ అడజానియా దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ ఈ చిత్రంలో షాహిద్ కపూర్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదవ హిందీ చిత్రంగా నిలిచింది.