Begin typing your search above and press return to search.

నా జాకెట్‌ గురించి న్యూస్‌లో ఆరుగురు చర్చ..!

తాజాగా కృతి సనన్‌ కరీనా కపూర్‌ టాక్ షో 'వాట్ ఉమెన్‌ వాంట్‌' లో పాల్గొంది. మహిళా ప్రధానంగా సాగుతున్న ఈ షో లో కృతి సనన్ మరోసారి ఆ వివాదం గురించి స్పందించింది.

By:  Ramesh Palla   |   7 Oct 2026 11:46 AM IST
నా జాకెట్‌ గురించి న్యూస్‌లో ఆరుగురు చర్చ..!
X

బాలీవుడ్ స్టార్ నటి కృతి సనన్‌ రాఖీ పండుగ సందర్భంగా ఒక కంపెనీ కోసం చేసిన యాడ్‌ ఏ స్థాయిలో దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగానే సోషల్‌ మీడియాలో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలను ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. అలాంటిది ఏమైనా పాయింట్‌ దొరికితే ఊరుకుంటారా.. వెంటనే సోషల్‌ మీడియాలో ఆ స్టార్‌ను ఓ రేంజ్‌లో విమర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. కృతి సనన్‌ విషయంలో జరిగింది పెద్ద తప్పు ఏం కాదు, రాఖి పండుగ సందర్భంగా ఒక జువెలరీ యాడ్‌ కోసం ధరించిన ఔట్‌ ఫిట్‌ విషయంలో వివాదం మొదలైన విషయం తెల్సిందే. రాఖీ పండుగ సందర్భంగా ఇలాంటి ఔట్‌ ఫిట్ ఏంటో అంటూ చాలా మంది ఆమెను తీవ్రంగా విమర్శించారు. అక్కడ తాను ప్రమోట్‌ చేస్తున్న జువెలరీ కనిపించాలనే ఉద్దేశంతో స్టైలిస్ట్‌ చెప్పిన ఔట్‌ ఫిట్‌ను కృతి సనన్ ధరించి ఉంటుంది. దానికి ఆమెను బాధ్యురాలిని చేయాల్సిన అవసరం లేదు. కానీ కంగనా ఈ విషయంలో ఎంటర్‌ కావడంతో వివాదం చాలా పెద్దగా మారింది.

కృతి సనన్‌ రాఖీ యాడ్‌ వివాదం...

ఇప్పటికే పలు సార్లు కృతి సనన్‌ ఆ రాఖీ యాడ్‌ గురించి స్పందించింది. అయినా కూడా ఆమె గురించి సోషల్‌ మీడియాలో ఇంకా కొందరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కృతి సనన్‌ కరీనా కపూర్‌ టాక్ షో 'వాట్ ఉమెన్‌ వాంట్‌' లో పాల్గొంది. మహిళా ప్రధానంగా సాగుతున్న ఈ షో లో కృతి సనన్ మరోసారి ఆ వివాదం గురించి స్పందించింది. ఈ సందర్భంగా కరీనా కపూర్‌ నుంచి ఆమెకు మద్దతు లభించింది. ఇండస్ట్రీలోనే కొందరు తనకు వ్యతిరేకంగా మాట్లాడటంను కృతి సనన్‌ తీవ్రంగా ఖండించింది. నటిగా తాను స్టైలిస్ట్‌ ఇచ్చిన ఔట్‌ ఫిట్‌ను ధరించాలి. ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు అందుకు తగ్గట్టు గా ఉంటాను. అందులో తప్పేం ఉంది అంటూ కృతి సనన్‌ ప్రశ్నించింది. తన రాఖీ యాడ్‌ వివాదం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని కృతి సనన్‌ తాజా టాక్ షో లో చెప్పుకొచ్చింది.

కరీనా కపూర్‌ టాక్‌ షో వాట్‌ ఉమెన్‌ వాంట్‌...

ఇంకా కృతి సనన్‌ మాట్లాడుతూ... తాను ధరించిన ఆ జాకెట్‌(చోలీ) గురించి ఒక జాతీయ ఛానల్‌ వారు ప్రైమ్‌ టైమ్‌ లో చర్చకు పెట్టారు. ఆ ప్రైమ్‌ టైమ్‌ న్యూస్‌ చర్చలో ఏకంగా ఆరుగురు పాల్గొని తన గురించి మాట్లాడటం కూడా విడ్డూరంగా అనిపించింది అంది. మహిళను జడ్జ్‌ చేయడం కోసం అంత మంది మాట్లాడటం ఏంటో అర్థం కాలేదు. అయినా ఒక జాతీయ స్థాయి మీడియా సంస్థ ఇలాంటి విషయాల గురించి మాట్లాడి, ప్రైమ్‌ టైమ్‌ లో చర్చ పెట్టడం వల్ల ఏం సాధించింది, తన ప్రేక్షకులకు ఏం సమాచారం ఇచ్చిందని కృతి సనన్‌ ప్రశ్నించింది. మహిళలను జడ్జ్‌ చేయడం అనేది సరి కాదు, ఎవరి పని వారు చూసుకుంటే బాగుంటుంది. అవతలి వారు వేసుకున్న డ్రెస్ గురించి, వారి ప్రవర్తన గురించి మాట్లాడాల్సిన అవసరం ఇతరులకు ఏంటి అని కృతి ప్రశ్నించింది. తన గురించి ఆ సమయంలో విమర్శలు చేసిన వారందరిపై కృతి సనన్‌ అసహనం వ్యక్తం చేసింది.

కాక్‌ టైల్‌ 2 సినిమాతో...

కృతి ఈ ఏడాదిలో ఇప్పటికే కాక్‌టైల్‌ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆడలేదు. అయినా కూడా కృతి సనన్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. రివ్యూవర్స్ సైతం కృతి యాక్టింగ్‌ బాగుందని పేర్కొన్నారు. అంతే కాకుండా ఆమె స్క్రీన్‌ ప్రజెన్స్ గురించి కూడా ప్రత్యేకంగా చర్చ జరిగింది. అందుకే ఆమెకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం కృతి సనన్‌ కొత్త సినిమాల ఎంపికతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలు ఏవీ విడుదలకు రెడీగా లేవు. ఒకటి రెండు చర్చల దశలో ఉంటే, మరో రెండు సినిమాలు షూటింగ్‌ ఆరంభ దశలో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో కృతి నుంచి రెండు మూడు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.