Begin typing your search above and press return to search.

నేష‌న‌ల్ క్ర‌ష్ తో ల‌వ్ లో ప‌డిపోయా!

బాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు కొత్తేమీ కాకపోయినా, ఇద్దరు స్టార్ హీరోయిన్లు కలిసి నటించినప్పుడు వారి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంద‌నే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉంటుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 May 2026 12:20 PM IST
నేష‌న‌ల్ క్ర‌ష్ తో ల‌వ్ లో ప‌డిపోయా!
X

బాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు కొత్తేమీ కాకపోయినా, ఇద్దరు స్టార్ హీరోయిన్లు కలిసి నటించినప్పుడు వారి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంద‌నే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్, ఇండస్ట్రీలో పోటీ వాతావరణం వంటి చర్చలు నడుస్తున్న ఈ సమయంలో, స్టార్ హీరోయిన్ కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్ద‌రూ క‌లిసి కాక్‌టెయిల్2 సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్‌యంలో రీసెంట్ గా తన కోస్టార్ రష్మిక మందన్నా గురించి కృతి చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

రీసెంట్ గా ఓ అవార్డు వేడుకలో పాల్గొన్న కృతి సనన్, రష్మికతో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఎంతో ఆప్యాయంగా పంచుకున్నారు. రష్మిక చాలా జెన్యూన్ వ్యక్తి అని, ఆమె దగ్గర ఎలాంటి నెగటివ్ ఎనర్జీ కనిపించద‌ని, ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ కంఫ‌ర్ట‌బుల్ గా ఫీల‌య్యేలా చూసుకుంటుంద‌ని, ముఖ్యంగా తనలో ఇన్‌సెక్యూరిటీ అనే ఫీలింగే ఉండ‌ద‌ని, చాలా ప్రేమగా, ఆత్మీయంగా ఉంటుందంటూ ప్రశంసల జ‌ల్లు కురిపించారు. సెట్స్‌లో రష్మికతో గడిపిన ప్రతి క్షణం ఎంతో సరదాగా అనిపించిందని చెప్పిన కృతి.. నేషనల్ క్రష్‌తో నిజంగానే ప్రేమలో పడిపోయానంటూ సరదాగా వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు హీరోయిన్ల మధ్య ఇంత పాజిటివ్ బాండింగ్ ఉండటం చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు.

ఇప్పటికే సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, బాలీవుడ్‌లో కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. అలాంటి సమయంలో మరో స్టార్ హీరోయిన్ నుంచి ఈ స్థాయి ప్రశంసలు రావడం ఆమె ఇమేజ్‌ను మరింత బలపరుస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కాక్‌టెయిల్2పై కూడా ఈ కామెంట్స్ కారణంగా ఆసక్తి పెరిగింది. 2012లో వచ్చిన కల్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కాక్‌టెయిల్ మూవీకి ఇది సీక్వెల్ కాకపోయినా, అదే ఫ్రాంచైజీ భావంతో తెరకెక్కుతున్న కొత్త కథగా మేకర్స్ దీనిని రూపొందిస్తున్నారు. డైరెక్ట‌ర్ హోమి అడజానియా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్ కీలక పాత్రలో నటిస్తుండగా, కృతి- రష్మికల స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మెయిన్ ఎట్రాక్ష‌న్ గా మారనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే రిలీజైన జబ్ తలక్ సాంగ్‌కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా యూత్ రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్, ఫ్రెండ్‌షిప్ అంశాలతో ఈ సినిమా నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. అయితే రిలీజ్‌కు ముందే కృతి సనన్ చేసిన కామెంట్స్ వల్ల రష్మిక మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి రావడం ఆమె ఫ్యాన్స్ ను మ‌రింత ఆనందింప‌చేస్తోంది.