కొత్త ఏడాది సీతమ్మ కొత్త కబురా?
ఒకేసారి రెండు పడవల ప్రయాణం అంత సులభం కాదు. అందులోనూ నటీమణులకు అసలే సాధ్యం కాదు. ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు.
By: Srikanth Kontham | 27 Oct 2025 10:00 PM ISTఒకేసారి రెండు పడవల ప్రయాణం అంత సులభం కాదు. అందులోనూ నటీమణులకు అసలే సాధ్యం కాదు. ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు. బాలీవుడ్ లో ఇలా రెండు పడవల ప్రయాణాన్ని మొదలు పెట్టింది కృతి సనన్. అమ్మడు బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. వరుస ప్రాజెక్ట్ లతో క్షణం తీరిక లేకుండా గడుపు తోంది. ఓ పక్క హీరోయిన్ గా నటిస్తూ మరో వైపు కమర్శియల్ యాడ్స్ తోనూ బిజీగా ఉంది. గత ఏడాది నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టింది. బటర్ ప్లై ఫిల్మ్స్ బ్యానర్ స్థాపించి తొలి చిత్రంగా `దో పత్తీ` నిర్మించింది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది.
దర్శక, నిర్మాతలతో చర్చలు:
ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. అయితే ఆ తర్వాత మళ్లీ మరో కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించలేదు. నటిగా బిజీగా ఉంది గానీ నిర్మాతగా మాత్రం బిజీ కాలేదు. ఈ నేపథ్యంలో తొలి సినిమాతోనే నిర్మాణం ఆపేసిందా? అన్న సందేహాలు బాలీవుడ్ లో వ్యకమవుతున్నాయి. నటిగా బిజీగా ఉండటంతో బ్యానర్ ని పట్టించుకోలేని స్థితిలో ఉందా? అన్న సందేహాల నేపథ్యంలో అందుకు ఛాన్సే లేదంటూ ముందుకొచ్చింది. రెండవ సినిమాగా ఎలాంటి చిత్రం నిర్మించాలి ? అన్న దానిపై సీరియస్ గా దర్శక, రచయితలతో చర్చలు జరుపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
లాంగ్ గ్యాప్ ఎందుకంటే?
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త ప్రాజెక్ట్ తో పాటు మరిన్ని కథలు విని లైన్ లో పెడుతున్నట్లు వినిపిస్తోంది. ఏ సినిమా నిర్మాణమైనా వెంట వెంటనే సాధ్యమ య్యేది కాదు. సినిమాపై కోట్ల రూపాయల పెట్టుబడి అంటే ఎన్నో విషయాలు ఆలోచించాల్సి ఉంటుంది. తొలి సినిమా డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో కృతిసనన్ మళ్లీ అలాంటి తప్పిదాలు దొర్లకుండా జాగ్రత్త పడుతుంది. ఈ క్రమంలోనే `దో పత్తి` తర్వాత కొత్త సినిమాకు లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
వెకేషన్ ఆస్వాదనలో సీతమ్మ:
తాజా అప్ డేట్ నేపథ్యంలో కొత్త ప్రాజెక్ట్ కు సమయం ఆసన్నమైనట్లే. ఇక నటిగా కృతి సనన్ పుల్ బిజీగా ఉంది. ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్. రాయ్ తెరకెక్కిస్తోన్న `తేరే ఇష్క్ మే`లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. హిందీ , తమిళ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగు తున్నాయి. అలాగే `కాక్ టెయిల్ 2`లోనూ నటిస్తోంది. ప్రస్తుతం కృతిసనన్ విదేశీ వెకేషన్స్ లో ఉంది. అబుదాబీ అందాల్ని ఆస్వాదిస్తోంది.
