Begin typing your search above and press return to search.

నేను ఫోటోలు తీసేవాళ్ల‌ను న‌మ్మ‌ను.. న‌టి ఫిక‌ర్!

``నేను ఫోటోలు తీసేవాళ్ల‌ను న‌మ్మ‌ను.. కొన్ని ఫోటోల‌ను తీసి ఉద్ధేశ‌పూర్వ‌కంగా వాటిని జూమ్ చేయ‌డం ద్వారా సంచ‌ల‌నాల‌ను సృష్టించాల‌ని అనుకుంటారు`` అని అన్నారు కృతి స‌నోన్.

By:  Sivaji Kontham   |   27 Aug 2025 4:00 AM IST
నేను ఫోటోలు తీసేవాళ్ల‌ను న‌మ్మ‌ను.. న‌టి ఫిక‌ర్!
X

``నేను ఫోటోలు తీసేవాళ్ల‌ను న‌మ్మ‌ను.. కొన్ని ఫోటోల‌ను తీసి ఉద్ధేశ‌పూర్వ‌కంగా వాటిని జూమ్ చేయ‌డం ద్వారా సంచ‌ల‌నాల‌ను సృష్టించాల‌ని అనుకుంటారు`` అని అన్నారు కృతి స‌నోన్. తాను పొట్టి దుస్తుల్లో ఉన్న‌ప్పుడు ఫోటోగ్రాప‌ర్లు త‌న‌ను ర‌క‌ర‌కాల కోణాల్లో ఫోటోలు తీసేందుకు ఆరాట‌ప‌డ‌తార‌ని, కానీ తాను వేదిక‌ల‌పైకి వెళ్లిన‌ప్పుడు త‌న స‌హ‌చ‌రుల‌ను త‌న‌కు ముందుగా నిల‌బ‌డాల‌ని రెక్వెస్ట్ చేస్తాన‌ని కూడా కృతి చెప్పింది.

వారు చూసే కోణం త‌ప్పుడు కోణం.. ఉద్ధేశపూర్వ‌కంగా అలాంటి ఫోటోలు తీస్తారు! అని కూడా కృతి అన్నారు. సినీరంగంలో ఎద‌గాల‌నుకున్న న‌టీమ‌ణుల‌కు ఇలాంటి వ్య‌క్తుల వ‌ల్ల స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని కూడా తెలిపారు. అయితే సెల‌బ్రిటీల గోప్య‌త‌ను కాపాడే విష‌యంలో హాలీవుడ్ మీడియా ప‌ద్ధ‌తిగా ఉంటుంద‌ని కూడా కృతి కితాబిచ్చింది. ఓసారి ప్రియాంక చోప్రా గౌన్ వేదిక‌పైనే జారిపోతుండ‌గా, ఆ స‌మ‌యంలో త‌న గౌర‌వాన్ని కాపాడుతూ అంత‌ర్జాతీయ‌ మీడియా దానిని షూట్ చేయ‌లేద‌ని చెప్పింది. కానీ భార‌తీయ మీడియా అలా కాదు. శ‌రీర అందాల‌ను హైలైట్ చేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంది. వీటిని మీడియాలు స్పెష‌ల్ స్టోరీలుగా వేస్తారు. అయినా మీడియా, సెల‌బ్రిటీల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర గౌర‌వం ఉండాలి! అని కృతి పేర్కొంది. అస‌లు మీడియాలు మ‌హిళ‌ల‌ను ఎలా చూస్తాయో చెప్పాల‌ని కూడా కృతి ఈ సంద‌ర్భంగా కోరారు. ఇది త్రోబ్యాక్ వీడియో అయినా జోరుగా వైర‌ల్ అవుతోంది.

మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌, గోప్య‌త‌, గౌర‌వం గురించి కృతి మాట్లాడిన విష‌యాలు అందరికీ న‌చ్చాయి. కృతి స‌నోన్ తో పాటు ఇటీవ‌లి కాలంలో ప‌లువురు యువ‌న‌టీమ‌ణులు ఇండ‌స్ట్రీలో స‌మ‌స్య‌ల‌పై బ‌హిరంగంగా చ‌ర్చిస్తూ చ‌ర్చ‌ల్లోకొస్తున్నారు. కాక్ టైల్ 2, తేరే ఇష్క్ మే అనే రెండు భారీ చిత్రాల్లో కృతి స‌నోన్ న‌టిస్తోంది.