Begin typing your search above and press return to search.

బాస్ లేడీ కృతి మిష‌న్ ఏంటో కానీ..! తిన‌డంలో ది బెస్ట్!

కృతి సనన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మిషన్ అకంప్లిష్డ్’ అంటూ పిజ్జా ఎమోజీతో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఆమె స్టైలిష్ లుక్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తుండగా, మరికొందరు స్టైలింగ్ టీమ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరోవైపు, తెలుగులో కొత్త సినిమాలకు ఎందుకు సంతకం చేయడం లేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ‘కాక్‌టెయిల్ 2’, ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ తర్వాత కృతి తదుపరి ప్రాజెక్ట్‌పై ఇంకా స్పష్టత లేదు.

By:  Sivaji Kontham   |   28 Nov 2026 10:27 PM IST
బాస్ లేడీ కృతి మిష‌న్ ఏంటో కానీ..! తిన‌డంలో ది బెస్ట్!
X

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిషో డిజైన్స్ - జీక్యూ ఇండియా ట్యాగ్స్‌తో ``వెల్, మిషన్ అకంప్లిష్డ్! `` అంటూ పిజ్జా ఎమోజీతో ఇచ్చిన క్యాప్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈవెంట్ లేదా షూట్ పూర్తయిన ఆనందంలో చిల్ అవుతూ కనిపించిన కృతి ఇలా పిజ్జా తినే మిష‌న్ చేప‌ట్టార‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే బాస్ లేడీ స్టైలిష్ అప్పియరెన్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది.




ఈ పోస్ట్ కింద అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తూ కామెంట్ సెక్షన్‌ను నింపేశారు. చాలామంది నెటిజన్లు కృతిని లేడీ బాస్, దివా, క్వీన్ ఆఫ్ బాలీవుడ్ అంటూ కొనియాడుతున్నారు. సింప్లిసిటీలోనూ ఇంత స్వాగ్ అద్భుతం, ఫేస్ కార్డ్ ఫర్ ఏజెస్, ``కృతి సనన్ కాదు.. ప్రెట్టీ సనన్``, ``అందం అనే పదం కూడా ఆమె ముందు చిన్నదే`` అంటూ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.




మరోవైపు మెజారిటీ నెటిజన్లు కృతి లుక్.. మేకప్.. స్టైలింగ్‌ను `ఫ్లాలెస్`, `ఫైర్ లుక్` అంటూ పొగుడుతుండగా ఒక అభిమాని మాత్రం ``మీరు చాలా అద్భుతంగా ఉన్నారు మేడమ్.. కానీ మీ స్టైలింగ్ టీమ్ మాత్రం ఆశించిన స్థాయిలో పని చేయలేదు`` అంటూ కాస్త భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఆసక్తికరంగా నిలిచింది. మొత్తానికి ``మిషన్ అకంప్లిష్డ్`` అంటూ కృతి సనన్ వదిలిన ఈ లేటెస్ట్ పోస్ట్ ఇటు ఫ్యాన్స్‌లో, అటు ఫ్యాషన్ ప్రియుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.

పిజ్జా తిన‌డంలో.. ఫ్యాష‌న్ ఫోటోషూట్ల‌తో ఇన్ స్టాగ్ర‌మ్ నింప‌డంలో చూపిస్తున్న ఉత్సాహం.. సౌత్ లో ఏదైన కొత్త సినిమాకి క‌మిట‌వ్వ‌డంలోను చూపిస్తే బావుండేది క‌దా! అంటూ కొంద‌రు అభిమానులు కృతిని ప్ర‌శ్నిస్తున్నారు. నాగ‌చైత‌న్య‌, మ‌హేష్‌, ప్ర‌భాస్ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో న‌టించిన కృతి స‌నోన్ తెలుగులో ఎందుకు క‌మిట‌వ్వ‌డం లేదో? అంటూ ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారు.

కాక్ టైల్ 2 త‌ర్వాత హై జ‌వానీ తో ఇష్క్ హోనా హై అనే చిత్రంలో న‌టించిన కృతి త‌దుప‌రి సినిమాకి ఇంకా సంత‌కం చేయ‌లేదు. అటు బాలీవుడ్ లోను కెరీర్ అంతంత మాత్ర‌మే. సౌత్ - నార్త్ లో పెద్ద ప్రాజెక్టుల‌కు ఇంకా సంత‌కాలు చేయ‌లేదు. కెరీర్ కీల‌క ద‌శ‌లో ఈ బ్యూటీ ఎందుకు నెమ్మ‌దిగా సాగుతోందో తెలియాల్సి ఉంది.