Begin typing your search above and press return to search.

మినీ స్కర్ట్ లో హీట్ పుట్టించిన కృతి సనన్!

బాలీవుడ్ బ్యూటీగా, సినీ ప్రేక్షకుల క్రష్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కృతి సనన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

By:  Madhu Reddy   |   20 May 2026 4:26 PM IST
మినీ స్కర్ట్ లో హీట్ పుట్టించిన కృతి సనన్!
X

బాలీవుడ్ బ్యూటీగా, సినీ ప్రేక్షకుల క్రష్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కృతి సనన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో, నటనతో ఆకట్టుకుంటున్న ఈ చిన్నది ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. అందులో భాగంగానే కాక్ టెయిల్ 2 సినిమాలో రష్మిక మందన్న తో పాటు మరో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది. అందులో భాగంగానే భిన్నమైన వస్త్రాలు ధరించి తన ఫ్యాషన్ లుక్ తో అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా తన సినిమా ప్రమోషన్స్ ను కూడా ఈ విధంగా చేపట్టింది.





మినీ స్కర్ట్ లో కృతి అందాలు..

అలా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న కృతి సనన్ తాజాగా మినీ స్కర్ట్ ధరించి ఆకట్టుకుంది . వైట్ కలర్ స్లీవ్ లెస్ క్రాప్ టాప్ ధరించిన ఈమె దీనికి కాంబినేషన్లో ఫ్లవర్స్ తో డిజైన్ చేసిన మినీ స్కర్ట్ ధరించి హీట్ పుట్టిస్తోంది. ముఖ్యంగా ఫోటోలకు ఫోజులిచ్చిన తీరు, ఆమె చూపులకు అభిమానులు ఫిదా అవ్వడమే కాకుండా ఇప్పటివరకు ఈమె చేసిన ఫోటో గ్యాలరీలన్నింటికీ ఇది కాస్త భిన్నం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జుట్టును వేవ్స్ రూపంలో వదిలేసిన ఈమె సింపుల్ చైన్ తో నెక్ ను ఫుల్ ఫిల్ చేసింది. మొత్తానికి అయితే తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా మినీ స్కర్ట్ లో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కృతి సనన్.





సినిమా సాంగ్ రిలీజ్ ఈవెంట్లో హొయలు..

విషయంలోకి వెళ్తే.. ఇటీవల కాక్ టెయిల్ 2 నుండి ఇటీవల "ఆగ్ తో కాఫీ లగ్నే వాలీ హై" అనే పాటను త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు ఒక ఈవెంట్ నిర్వహించగా అందులో ఈ లుక్కులో దర్శనమిచ్చి ఆకట్టుకుంది.. పైగా ఈ ఫోటోలు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2012లో విడుదలై బాలీవుడ్లో మంచి ప్రేక్షక ఆదరణ పొందిన కాక్ టెయిల్ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.





ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం..

షాహిద్ కపూర్ హీరోగా వస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్ తో పాటు రష్మిక మందన్న కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. హోమి అడజానియా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా స్నేహం, ప్రేమ, ఆధునిక సంబంధాల భావోద్వేగాల కలయికలో జూన్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు ముంబైలో వరుస ప్రమోషనల్ కార్యక్రమాలను చేపడుతూ సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చిత్ర బృందం.