ప్రియుడిని తలచి తలచి కృతి విరహం
ఇంతలోనే ఈ భామ తన ప్రియుడు కబీర్ కి హృదయపూర్వక పుట్టినరోజు మెసేజ్‌ని పోస్ట్ చేసి చర్చల్లోకి వచ్చింది.. తన పోస్ట్ లో కృతి ఇలా రాసింది.
By: Sivaji Kontham | 20 Nov 2025 7:18 PM ISTకృతి సనోన్ పరిచయం అవసరం లేదు. నేటి జెన్ జెడ్ స్టార్లలో చురుకైన నటిగా కృతి తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. `మిమి` చిత్రంలో నటనకు గాను కృతి జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది. ఇటీవల క్రూ చిత్రంలో కృతి స్టన్నింగ్ పెర్ఫామెన్స్ కి మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ధనుష్ సరసన తేరే ఇష్క్ మే అనే చిత్రంలో నటించింది. ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం రిలీజ్ ప్రచారంలో బిజీబిజీగా ఉంది. ఇంతలోనే ఈ భామ తన ప్రియుడు కబీర్ కి హృదయపూర్వక పుట్టినరోజు మెసేజ్‌ని పోస్ట్ చేసి చర్చల్లోకి వచ్చింది.. తన పోస్ట్ లో కృతి ఇలా రాసింది.
''నేను ఎవరితో అయితే సౌకర్యంగా ఉండగలనో ఆ వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు! కబీర్.. ప్రపంచం మీ మంచి హృదయాన్ని ఎప్పటికీ మార్చకుండా ఉండుగాక!'' అంటూ తన హృదయాన్ని ఆవిష్కరించింది కృతి. ఇది గుండె లోతుల్లోంచి వచ్చిన విష్. చూస్తుంటే ఆ ఇద్దరి మధ్య ఏదైనా లోతుగా ఘాఢంగా ఏదో జరుగుతోందని అంతా ఊహిస్తున్నారు.
నిజానికి ఈ జంట నడుమ వ్యవహారంపై పుకార్లు రెండేళ్లుగా ఉన్నాయి. పబ్లిక్ ఔటింగుల్లో చాలాసార్లు కలిసి కనిపించారు. మొదట దుబాయ్ పార్టీలో కెమెరా కంటికి చిక్కిన తరువాత ముంబైలో కొన్నిసార్లు ప్రైవేట్ పార్టీల్లో కలిసి కనిపించారు. కృతి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలోను కబీర్ బాహియా కనిపించాడు. ఈ జంట అందమైన కెమిస్ట్రీ, కంఫర్ట్ చూడగానే అభిమానులు థ్రిల్ అయ్యారు.
తొందర్లోనే ఈ జంట పెళ్లికి సిద్ధమవుతోందని కూడా కథనాలొచ్చాయి. కానీ ఇంకా దానికి సమయం దగ్గరపడలేదు. ఇటీవలే సినీనిర్మాణంలోకి ప్రవేశించిన కృతి కొత్త బ్యానర్ ని ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉంది. ప్రస్తుతం తేరే ఇష్క్ మే ప్రచారం కోసం ధనుష్ తో కలిసి నగరాలను పర్యటిస్తోంది.
కబీర్ బాహియా గురించి...
యూకేకి చెందిన ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ యజమాని కుల్జిందర్ బహియా కుమారుడు కబీర్. వరల్డ్‌వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజంలో మేనేజింగ్ డైరెక్టర్. అతడు రీజెంట్ యూనివర్సిటీ లండన్‌లో చదువుకున్నాడు. అక్కడ అతడు వ్యాపారం, నిర్వహణ, మార్కెటింగ్ సంబంధిత టాపిక్ లపై ప్రత్యేక తర్ఫీదు పొందాడు.
