ఐటం భామగా అవతారం ఎత్తిన సీతమ్మ!
కృతిససన్ టాలీవుడ్, బాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో భాగమైన అమ్మడి కెరీర్ అవి పెద్దగా ఉపయోగ పడలేదు.
By: Srikanth Kontham | 20 April 2026 11:13 AM ISTకృతిససన్ టాలీవుడ్, బాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో భాగమైన అమ్మడి కెరీర్ అవి పెద్దగా ఉపయోగ పడలేదు. ఆ రెండు భారీ కాన్వాస్ పై తెరకెక్కిన సినిమాలే అయినా ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి. అలాగని అమ్మడు టాలీవుడ్ కు దూరంగా కాలేదు. ఇక్కడ పరిశ్రమకు టచ్ లో ఉంటూనే బాలీవుడ్ లో కూడా దిగ్విజయంగా కెరీర్ ను కొనసాగిస్తోంది. అనతి కాలంలోనే జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సైతం అందుకుని ఉత్తరాదిన తన ఇమేజ్ ను అంతకంతకు పెంచుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్ బిజీ నాయికల్లో తాను కూడా ఒకరు. అదనంగా లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతోనూ సత్తా చాటడం అమ్మడి ప్రత్యేకత. ఇలా కమర్శియల్ సినిమాలతో పాటు లీడ్ రోల్స్ పోషిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ కొత్త జర్నీ కూడా మొదలు పెట్టినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తోన్నస`హై జవానీ తో ఇష్క్ హోనా హై` అనే చిత్రంలో అమ్మడు ఐటం భామగా మెప్పించడానికి రెడీ అయింది. ఇందులో మృణాల్ ఠాకూర్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తుండగా, ఐటం భామగా మాత్రం కృతి సనన్ ని ఎంపిక చేసారు.
ఈ పాటతో కృతి తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించబోతోంది. ఈ పాట చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. ఈ పాట షూటింగ్ కోసం చిత్ర బృందం ఓ భారీ సెట్ నిర్మించింది. కృతి లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె పోషించిన పాత్రల కంటే ఇది భిన్నంగా, అత్యంత గ్లామరస్‌గా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. అమ్మడి అభిమానులకు ఇదో పెద్ద సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఈ స్పెషల్ సాంగ్ గురించి కృతి సనన్ గానీ, సినిమా టీమ్ గానీ ఎక్కడా అధికారికంగా పెదవి విప్పలేదు. అంతా చాలా గోప్యంగా ఉంచుతున్నారు.
సినిమా ప్రమోషన్స్ సమయంలో ఈ పాటను సర్ప్రైజ్ ప్యాకేజీగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లు ఐటం సాంగ్స్ చేయడం ట్రెండ్‌గా మారిన సంగతి తెలిసిందే. సమంత, పూజా హెగ్డే, శ్రుతిఒ హాసన్ వంటి అగ్ర తారలు ఇప్పటికే స్పెషల్ సాంగ్స్‌తో భారీ క్రేజ్ తెచ్చుకున్నారు. కృతి కూడా అదే బాటలో పయనిస్తూ నటిగానే కాకుండా గ్లామర్ , డ్యాన్స్ పవర్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలని భావిస్తోంది. ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. `ఆదిపురుష్` లో సీతమ్మ పాత్రలో ఆకట్టుకున్న కృతి సనన్ ఇప్పుడు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఐటం పాటలో నటించడంపై ఆస్తికర చర్చ నడుస్తోంది. `హై జవానీ తో ఇష్క్ హోనా హై`లో ఆమె చేసే హంగామా ఎలా ఉండబోతుందో చూడాలి.
