Begin typing your search above and press return to search.

ప్రేమలో పడ్డ ప్రభాస్ బ్యూటీ..

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అనౌన్స్ చేసిన కొన్ని కాంబినేషన్స్ వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ కాంబినేషన్స్ అనౌన్స్ చేయగానే విపరీతమైన అంచనాలు సినిమా మీద నెలకొంటాయి.

By:  Madhu Reddy   |   15 Nov 2025 12:00 AM IST
ప్రేమలో పడ్డ ప్రభాస్ బ్యూటీ..
X

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అనౌన్స్ చేసిన కొన్ని కాంబినేషన్స్ వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ కాంబినేషన్స్ అనౌన్స్ చేయగానే విపరీతమైన అంచనాలు సినిమా మీద నెలకొంటాయి. అలా సక్సెస్ఫుల్ సినిమాలతో మంచి పేరు సాధించుకున్న సుకుమార్ మహేష్ బాబు హీరోగా నేనొక్కడినే అనే సినిమా చేశారు. సినిమా అనౌన్స్ చేసిన వెంటనే భారీ హైప్ క్రియేట్ అయింది. అలానే ఈ సినిమాకి సంబంధించిన లుక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి.

ఒక తరుణంలో మహేష్ బాబు ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడు అనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. అయితే ఇదే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఈ సినిమా ఫెయిల్ అయిన కూడా కృతి పర్ఫామెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. బ్యూటీలో కూడా టాలెంట్ ఉంది అని చాలామందికి అర్థమైంది.

నాగచైతన్య సరసన

స్వామి రారా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు సుదీర్ వర్మ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో వెంటనే నాగ చైతన్య సరసన హీరోయిన్ గా సినిమా చేసే అవకాశం దక్కింది. దోచెయ్ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కూడా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.ఆ తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఏకంగా హిందీకి షిఫ్ట్ అయిపోయింది.

అటు బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అప్పుడు వరుస ప్రాజెక్టులు ప్రభాస్ అనౌన్స్ చేశారు. అందులో ఆది పురుష్ ఒకటి. ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన కృతి సనన్. సీత పాత్రలో ఆ సినిమాలో నటించింది. ఆ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది.

ప్రేమలో పడింది

ఇక రీసెంట్ గా విక్కీ కౌశల్ తో పాటు కృతి సనన్ కాజోల్, ట్వింకిల్ ఖన్నా జంటగా వ్యవహరిస్తున్న టూ మచ్ టాక్ షో కు విక్కీ కౌశల్ తో హాజరైంది. ఆ షోలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు చెప్పింది. ఆ షో జరుగుతున్న సందర్భంలో ఒక సెగ్మెంట్ లో భాగంగా రిలేషన్షిప్ గురించి మాట్లాడవలసి వచ్చింది. దీంతో కృతి తన రిలేషన్షిప్ గురించి కన్ఫామ్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసింది.

అయితే ఈమెను మాత్రం తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ గా పేరు సంపాదించుకున్న కబీర్ బాహియా తో రిలేషన్ లో ఉన్నట్లు ఆమెను ఆటపట్టించారు విక్కీ కౌశల్. ఇక తర్వాత ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తను చాలా రొమాంటిక్ గా ఉంటానని, ఎక్కువగా ప్రేమ కథలను వింటాను అని తెలిపింది.