Begin typing your search above and press return to search.

టాటూతో ఆకట్టుకుంటున్న కృతి సనన్.. మీనింగ్ కూడా చెప్పిందిగా!

కృతి సనన్ తాజాగా తన కాలు మీద ఎగిరే పక్షి ని టాటూగా వేయించుకుంది. అంతేకాదు ఆ టాటూ కింద ఈ విధంగా రాసుకొచ్చింది..

By:  Madhu Reddy   |   14 Sept 2025 7:30 PM IST
టాటూతో ఆకట్టుకుంటున్న కృతి సనన్.. మీనింగ్ కూడా చెప్పిందిగా!
X

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.. ఈమె కేవలం బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా తనదైన గుర్తింపు సంపాదించుకుంది. అలా తెలుగులో సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన మహేష్ బాబు మూవీ '1 నేనొక్కడినే' సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా నాగచైతన్యతో దోచేయ్, ప్రభాస్ తో రామాయణం ఆధారంగా వచ్చిన 'ఆదిపురుష్' సినిమాలో సీత పాత్రలో నటించింది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారా తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎక్కువగా బాలీవుడ్ లోనే రాణించింది.

అలా బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఈ హీరోయిన్.. తాజాగా ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంది. అదేంటంటే టాటూ వేయించుకోవడం.. అదేంటి టాటూ వేయించుకోవడం కూడా ఒక షాకింగ్ నిర్ణయమేనా? అని మీరు అనుకోవచ్చు.. అయితే చాలామంది సెలబ్రిటీలు తమ ఒంటిమీద రకరకాల అర్ధాలు వచ్చేలా టాటూలు వేయించుకుంటారు. వాళ్ళు వేయించుకున్న ప్రతి ఒక్క టాటూ వెనుక ఏదో ఒక అర్థం దాగే ఉంటుంది. అయితే బాలీవుడ్ నటి కృతి సనన్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క టాటూ కూడా తన ఒంటిపై వేయించుకోలేదట.. కానీ మొదటిసారి తన ఒంటిపై ఒక టాటూను వేసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి ఇంతకీ కృతి సనన్ వేసుకున్న ఆ టాటూ ఏంటి..? దాని అర్థం ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కృతి సనన్ తాజాగా తన కాలు మీద ఎగిరే పక్షి ని టాటూగా వేయించుకుంది. అంతేకాదు ఆ టాటూ కింద ఈ విధంగా రాసుకొచ్చింది.."నేను కూడా టాటూ వేయించుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు.. కానీ తొలిసారి టాటూ వేయించుకుంటున్నాను.. ఇన్నాళ్లకు నా వాగ్దానం నెరవేరింది. పక్షిలాగే నేను కూడా సూర్యోదయంలో ఎగురుతూ స్వేచ్ఛా జీవితాన్ని గడపాలని చూస్తున్నాను. కళ్ళతో కలలు కంటున్న ఎవరైనా సరే మీరు భయపడే ఆ ఎత్తును తీసుకోండి..ఇది సులభం కాకపోవచ్చు.. కానీ మీరు మీ మార్గాలను కనుగొంటారు. ఎగరడం నేర్చుకుంటారు అంటూ.. జీవితంలో ముందడుగు వేయాలి అనే లక్ష్యంతో ఫ్లయింగ్ బర్డ్ ను టాటుగా వేయించుకున్నట్లు చెప్పుకొచ్చింది కృతి సనన్.

అలా తన జీవితంలో ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలనే మీనింగ్ వచ్చేలా కృతి సనన్ తన కాలిపై టాటూ వేయించుకుంది.ప్రస్తుతం కృతి సనన్ వేసుకున్న ఆ టాటూకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.. కృతి సనన్ సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్లో చివరిగా గణపథ్ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఆనంద్ ఎల్. రాయ్ డైరెక్షన్ లో కోలీవుడ్ నటుడు ధనుష్ తో కలిసి తేరే ఇష్క్ మే అనే సినిమాలో నటిస్తోంది..