బాక్సాఫీస్ వసూళ్లతో నాకేం పని!
సక్సెస్ అయినా? ఫెయిలైనా ఇందులోకి ఇన్వాల్వ్ కానిది ఎవరు? అంటే హీరోయిన్లు..సినిమాలో ఇతర నటీనటులు. సినిమా హిట్ అయితే అందరితో పాటు తమకి పేరొస్తుంది.
By: Srikanth Kontham | 3 Jan 2026 6:00 PM ISTసినిమా సక్సెస్ అయితే? అందులో అందరూ భాగస్వాములవుతారు. సక్సెస్ లో ఎవరికివారు తమ పాత్రే కీలకమంటారు. ముఖ్యంగా ఈ రకమైన చర్చ దర్శక, హీరోల మధ్య కొంత కాలం క్రితం ఉండేది. ఇప్పుడా బాధ్యత చాలా వరకూ దర్శకుడే తీసుకుంటున్నాడు. కొంత మంది హీరోలు కూడా స్వచ్చందంగా ముందుకొచ్చి తమ వైఫల్యం గురించి కూడా ఓపెన్ అవుతున్నారు. సక్సెస్ అయినా? ఫెయిలైనా ఇందులోకి ఇన్వాల్వ్ కానిది ఎవరు? అంటే హీరోయిన్లు..సినిమాలో ఇతర నటీనటులు. సినిమా హిట్ అయితే అందరితో పాటు తమకి పేరొస్తుంది.
లేకపోతే లేదు అని లైట్ తీసుకునే వాళ్లు కొందరుండగా? మరికొంత మంది అంతే బాధ్యతగానూ ఉంటారు. సక్సెస్..ఫెయిల్యూర్ ని ఓ ఒత్తిడిగా భావిస్తుంటారు. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ నటి కృతిసనన్ కూడా ఓపెన్ అయింది. తాను ఎలాంటి కథ ఎంపిక చేసుకున్నా? ఒకదాని కొకటి భిన్నంగా ఉండాలనే కోరుకుంటానంది. నటించిన అన్ని సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించాలని ఆశీంచకూడదంది. ఏ సినిమా నచ్చుతుందో? ఏ సినిమా నచ్చదో అంచనా వేయడం అంత సులభం కాదంది. తనకు నచ్చిన సినిమా తన పక్క సీట్లో కూర్చున్న మరొకరికి నచ్చకపోవచ్చు.
సినిమా ఫలితాలు..బాక్సాఫీస్ ఫలితాల గురించి అయితే ఆసలే ఆలోచించనంది. ఏ సినిమాకు కమిట్ అయినా నిజాయితీగా పనిచేసి బయటకు రావడం తప్ప! మిగతా ఏ విషయాలు కూడా పట్టించుకోనంది. వాటిని అనవసరమైన విషయాలగానే పరిగణిస్తానంది. సినిమాలో తన పాత్ర ఎంత వరకూ అన్నది ముందే డిసైడ్ అయిపోతుందట. ఆ ప్రకారమే తాను ముందుకెళ్తానంది. అనవసరంగా దర్శక, నిర్మాతలతో పూసుకోవడం వంటి పనులు నచ్చవంది. చేసిన పని నిజాయతీగా పనిచేసి బయటకు వచ్చేయడంతో సరి. బాక్సాఫీస్ వద్ద సినిమా ప్రభావం చూపాలంటే ఎన్నో అంశాలుంటాయంది.
అవన్నీ దర్శకుడి మీద..అతడి పనితనంపై ఆధారపడి ఉంటాయి. వాటిలో నటులు ఎలా భాగమవుతారంది. కాబట్టి వాటి గురించి ఎంత మాత్రం టెన్షన్ తీసుకోనంది. ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయినా ఏ మాత్రం ఒత్తిడికి గురికా నంది. తాను ఏ సినిమాకు పని చేసినా కేవలం పాత్రలో ప్రయాణాన్ని మాత్రమే ఆస్వాదిస్తానంది. ఈ బ్యూటీ గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన 'తేరే ఇష్క్ మే' తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. 'దో పత్తి' తో నిర్మాత గానూ ప్రయాణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కానీ తొలి సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు. నటిగా అదే ఏడాది 'క్రూ'తో కూడా మరో భారీ విజయాన్నే అందుకుంది. ప్రస్తుతం 'కాక్ టెయిల్ 2' లో నటిస్తోంది.
