Begin typing your search above and press return to search.

మినీ డ్రెస్ లో కృతి అందాలు.. సూపర్ ఫన్ అంటూనే గ్లామర్ డోస్!

సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన వన్ నేనొక్కడినే అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కృతి సనన్.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది.

By:  Madhu Reddy   |   12 Jun 2026 10:00 PM IST
మినీ డ్రెస్ లో కృతి అందాలు.. సూపర్ ఫన్ అంటూనే గ్లామర్ డోస్!
X

సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన వన్ నేనొక్కడినే అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కృతి సనన్.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. ఇక ఈ సినిమా తర్వాత హిందీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. ప్రస్తుతం బాలీవుడ్లో కాక్ టెయిల్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. జూన్ 19వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో అటు ప్రమోషనల్ కార్యక్రమాలతో జోరు పెంచింది ఈ ముద్దుగుమ్మ.





తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే తాజాగా ఆరంజ్ కలర్ స్లీవ్ లెస్ మినీ డ్రెస్ ధరించి అందాలతో మెస్మరైజ్ చేసింది కృతి సనన్ . ఎంబ్రాయిడరీ తో స్టార్ ఫిష్ ఆకృతిలో చక్కగా డిజైన్ చేసిన ఈ ఆరంజ్ కలర్ మినీ షార్ట్ ఈమె అందాలను మరింత రెట్టింపు చేసింది. ఇక మరికొన్ని ఫోటోలలో డెనిమ్ షార్ట్ , జీన్స్ ధరించి హొయలు పోయింది. ఇకపోతే ఈ ఫోటోలను షేర్ చేస్తూ "ముంబైలో కాక్ టెయిల్ 2 ప్రమోషన్స్ లో ఫుల్ ఎంజాయ్ చేసాము.. ఇక ఫన్ క్రియేట్ చేయడానికి పూణేకి వస్తున్నాం సిద్ధంగా ఉండండి" అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం కృతి సనన్ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.





కాక్ టెయిల్ 2 విషయానికి వస్తే.. 2012లో వచ్చిన సూపర్ హిట్ మూవీ కాక్ టెయిల్ కి సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్, కృతి సనన్ తో పాటు రష్మిక మందన్న కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. హోమి అడజానియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 19వ తేదీన థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాపై అంచనాలు పెంచగా ఇప్పుడు మరొకవైపు కృతి సనన్ , రష్మిక మందన్న, షాహిద్ కపూర్ త్రయం సినిమా ప్రమోషన్స్ లో సందడి చేస్తూ సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి జూన్ 19న ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.





ఇదిలా ఉండగా మరొకవైపు కృతి సనన్ కి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సఅందిన మాచారం ప్రకారం ముంబైలోని అందేరీ వెస్ట్ లో ఉన్న తన 4 లగ్జరీ ఇళ్లను క్యాస్టింగ్ డైరెక్టర్ కి విక్రయించినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా సెలబ్రిటీలు రాణిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే హైదరాబాదులోని జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాలలో హీరో హీరోయిన్లు ఇల్లు కొని, అమ్మి ఎలా అయితే లాభాలు సాధిస్తున్నారో .. అటు బాలీవుడ్ లో కూడా అదే క్రయ విక్రయ ట్రెండు బాగా నడుస్తోంది .





ముఖ్యంగా ముంబై , పూణే వంటి అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాలలో ఇళ్లను కొనుగోలు చేయడం, ఆ తర్వాత వాటిని అమ్మేయడం లాంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కృతి సనన్ కూడా తన తల్లి గీతా సనన్, నుపూర్ సనన్ లతో కలిసి ముంబైలో ఉన్న 4 లగ్జరీ అపార్ట్మెంట్లను ఒకేసారి విక్రయించి వార్తల్లో నిలిచారు.