Begin typing your search above and press return to search.

హాటెస్ట్ రోల్... కృతి స‌నోన్ ఇందులో కొత్తేం ఉంద‌ని?

అందాల క‌థానాయిక‌ కృతి సనన్ `కాక్‌టెయిల్ 2` గురించి చాలా ఎగ్జ‌యిట్ అవుతోంది.

By:  Sivaji Kontham   |   31 March 2026 11:00 PM IST
హాటెస్ట్ రోల్... కృతి స‌నోన్ ఇందులో కొత్తేం ఉంద‌ని?
X

అందాల క‌థానాయిక‌ కృతి సనన్ `కాక్‌టెయిల్ 2` గురించి చాలా ఎగ్జ‌యిట్ అవుతోంది. ఈ సినిమాలో తన పాత్ర కెరీర్‌లోనే అత్యంత `హాటెస్ట్` అని స్వయంగా ప్రకటించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే అభిమానుల వెర్ష‌న్ వేరుగా ఉంది. గ్లామర్ ఒలికించడం కృతికి కొత్తేమీ కాదు క‌దా! అని ప్ర‌శ్నిస్తున్నారు.

నిజానికి కృతి సనన్ తన మొదటి సినిమా `1 నేనొక్కడినే` లోనే గ్లామర్ పరంగా ఎక్కడా తగ్గకుండా నటించింది. ఆ సమయంలోనే తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసిన ఈ భామ.. ఇటీవల టబు, కరీనా కపూర్‌లతో కలిసి నటించిన `క్రూ` చిత్రంలోనూ చాలా హాట్‌గా కనిపించింది. అయితే ఇప్పుడు `కాక్‌టెయిల్ 2`లో అంతకుమించిన గ్లామర్ డోస్‌ను ఒక సరికొత్త అవతారంలో చూపించబోతున్నానని చెబుతోంది.

దర్శకుడు హోమీ అదాజానియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా తనను ఇంతటి బోల్డ్ అండ్ స్టైలిష్ లుక్‌లో ఆవిష్కరించినందుకు కృతి అత‌డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కోసం పూర్తి స్థాయి మేకోవర్ సాధించిన కృతి ఇందులో `సౌమ్య` అనే పాత్రలో నటించనుంది. మొదటి భాగంలో దీపికా పదుకోన్ పోషించిన వెరోనికా పాత్ర తరహాలోనే ఇది కూడా చాలా బోల్డ్ గా మోడరన్ అమ్మాయిలా క‌నిపించ‌నుంది.

హోమీ అదాజానియాతో పని చేయడం వల్ల తనలోని ఒక కొత్త కోణాన్ని వెలికి తీయగలిగానని కృతి సనన్ వెల్లడించారు. ఈ చిత్రంలో కృతి ధరించే ఫ్యాషనబుల్ డ్రెస్సులు, త‌న‌ స్టైలింగ్ ఫ్యాషన్ ప్రియులను తప్పకుండా ఆకట్టుకోనుంది. కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న సంక్లిష్టమైన పాత్ర కావడం వల్లే ఇది తనకు ఒక సవాల్‌గా అనిపించిందని కృతి పేర్కొన్నారు.

దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. 2012లో వచ్చిన సూపర్ హిట్ `కాక్‌టెయిల్`కు ఇది సీక్వెల్ కావడంతో అదే తరహా మ్యాజిక్‌ను ఈ సినిమా కూడా రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నేటి తరం యువతకు నచ్చే మోడరన్ లవ్- ఫ్రెండ్ షిప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కృతి సనన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిల‌వ‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.