Begin typing your search above and press return to search.

నడుము వయ్యారాలతో గిలిగింతలు పెడుతున్న కృతి సనన్!

సెలబ్రిటీలు నిత్యం అందంగా.. గ్లామర్ టచ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు అంటే వీరి గ్లామర్ వెనుక స్టైలిస్ట్, డిజైనర్ల కష్టం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

By:  Madhu Reddy   |   2 Jun 2026 10:00 PM IST
నడుము వయ్యారాలతో గిలిగింతలు పెడుతున్న కృతి సనన్!
X

సెలబ్రిటీలు నిత్యం అందంగా.. గ్లామర్ టచ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు అంటే వీరి గ్లామర్ వెనుక స్టైలిస్ట్, డిజైనర్ల కష్టం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా తెరపై సెలబ్రిటీలను అందంగా చూపించి.. తెర వెనుక వారు పడుతున్న కష్టం వర్ణనాతీతం. ఒకప్పుడు సెలబ్రిటీలను ఇంత అందంగా తయారు చేస్తున్న వారి గురించి పెద్దగా తెలిసేది కాదు. కానీ ట్రెండు మారింది.సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తరువాత ప్రతీదీ ఇట్టే వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలతోపాటు వారి స్టైలిస్టులు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.




అలాంటి వారిలో కృతి సనన్ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ కూడా ఒకరు. తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్న కృతి సనన్ లేటెస్ట్ అవుట్ ఫిట్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. నిత్యం గ్లామర్ టచ్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో ఔట్ ఫిట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో హై కాంట్రాస్ట్ మ్యాక్సీ డ్రెస్ ను ధరించింది ఈ ముద్దుగుమ్మ.




స్లీవ్ లెస్ బ్లాక్ టాప్ కి కాంబినేషన్ లో దానికి జతగా వైట్ కలర్ ఫ్లోయింగ్ స్కర్ట్ ను ధరించింది. ఇక సైడ్ అందాలను చూపిస్తూ హొయలు పోయిన ఈమె.. నడుము వయ్యారాలను చూపిస్తూ అభిమానులకి గిలిగింతలు పెట్టింది. ఇక అలాగే పొడువాటి ఇయర్ రింగ్స్ ధరించిన ఈమె జుట్టును వదిలేసి నెక్ ను బోసిగా ఉంచి తన లుక్కును మరింత హైలెట్ చేసుకుంది. ఇకపోతే ఈ అందమైన ట్రెండీ లుక్ ను ప్రముఖ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ డిజైన్ చేశారు.




అసలు విషయంలోకి వెళ్తే.. షాహిద్ కపూర్, కృతి సనన్ , రష్మిక మందన్న కలయికలో హోమి అడజానియా దర్శకత్వంలో రాబోతున్న బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా కాక్ టెయిల్ 2. కాక్ టెయిల్ మూవీకి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం జూన్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీతం సంగీతాన్ని స్వరపరచగా.. సాహిత్యాన్ని అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఒకవైపు ప్రమోషనల్ కార్యక్రమాలు చేపడుతూనే మరొకవైపు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.

ఈ ఈవెంట్లో ఈ డ్రెస్ తో కృతి సనన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ డిజైన్ చేసిన ఈ ఫుల్ మేకోవర్తో తన అందాన్ని రెట్టింపు చేసుకుంది కృతి. మొత్తానికైతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తన అవుట్ ఫిట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం కృతి సనన్ లేటెస్ట్ ఔట్ ఫిట్ ఫోటోలను సుకృతి గ్రోవర్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఆ ఫోటోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి..

కృతి సనన్ విషయానికి వస్తే.. తొలిసారి సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వచ్చిన ఈమె ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ సరసన ఆది పురుష్ సినిమాలో సీత పాత్ర పోషించింది. ఇది కూడా పెద్దగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు హిందీలో కాక్ టెయిల్ 2 చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధమైంది కృతి సనన్.