Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : బర్త్‌డే వెకేషన్‌లోనూ అందాల ఆరబోత

దశాబ్ద కాలం క్రితం '1 నేనొక్కడినే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి సనన్‌.

By:  Ramesh Palla   |   30 July 2025 6:00 PM IST
పిక్‌టాక్‌ : బర్త్‌డే వెకేషన్‌లోనూ అందాల ఆరబోత
X

దశాబ్ద కాలం క్రితం '1 నేనొక్కడినే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి సనన్‌. ఆ సినిమా కమర్షియల్‌గా సరిగ్గా ఆడలేదు. కానీ మహేష్‌ బాబు, సుకుమార్‌లకు మంచి పేరును తెచ్చి పెట్టింది. అయితే హీరోయిన్‌గా నటించిన కృతి సనన్ గురించి పెద్దగా జనాలు మాట్లాడుకోలేదు. ఆ సమయంలోనే హిందీలో చేసిన హీరో పంతీ సినిమాతో మంచి గుర్తింపు లభించింది. తెలుగులో మరోసారి దోచేయ్‌ అంటూ నాగ చైతన్యతో కలిసి నటించింది. తెలుగులో చేసిన రెండు సినిమాలు నిరాశ మిగల్చడంతో మళ్లీ టాలీవుడ్‌ వైపు చూడకుండా హిందీ సినిమాలు వరుసగా చేస్తూ వచ్చింది. హిందీలో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా నిలిచిన కృతి సనన్‌ సుదీర్ఘ గ్యాప్‌ తర్వాత ఆదిపురుష్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీత పాత్రలో కృతి సనన్‌ ఆకట్టుకుంది.

కృతి సనన్ బర్త్‌డే

గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతి సనన్‌ ఈ ఏడాది కొత్త సినిమాను ఇంకా విడుదల చేయలేదు. తేరే ఇష్క్‌ మే అనే సినిమాను ఈ ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో ఆమె పాత్ర కొత్తగా ఉంటుందని అంటున్నారు. కృతి అధికారికంగా మరే కొత్త సినిమాకు కమిట్‌ అవ్వలేదు. ఇటీవల కృతి సనన్‌ తన బర్త్‌డేను సన్నిహితులతో కలిసి సముద్ర మధ్యలో జరుపుకుంది. జులై 27న తన బర్త్‌డే సందర్భంగా సన్నిహితులతో వెకేషన్‌కి వెళ్లింది. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బర్త్‌ డే వెకేషన్‌కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేయడంతో మరోసారి ఈమె వార్తల్లో నిలిచింది.

ప్రైవేట్‌ బోట్‌లో బర్త్‌డే పార్టీ

వెకేషన్‌లో అందాల కృతి సనన్‌ ఎప్పటిలాగే ఆకట్టుకుంది. బర్త్‌డే వెకేషన్‌ ఫోటోలు అంటూ షేర్‌ చేసిన పలు ఫోటోల్లో కృతి సనన్‌ చాలా అందంగా కనిపించింది. సముద్రం మధ్యలో మరింత అందంగా కృతి కనిపిస్తుంది. ప్రైవేట్‌ బోట్‌లో కృతి అండ్‌ టీం ప్రయాణం చాలా అహ్లాదబరింతంగా సాగింది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. చాలా అందంగా ఫోటోలకు ఫోజ్‌లు ఇవ్వడం, స్పీడ్‌ బోట్‌తో సాహసం చేయడం కామన్‌ విషయం. కానీ కృతి బోట్‌ లోనూ వర్కౌట్‌లు చేసింది. ఆ వీడియోను కూడా షేర్‌ చేసింది. కిందకు వంగి డంబెల్స్‌ను లిఫ్ట్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేసిన కృతి సనన్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. కొందరు అక్కడకు వెళ్లినా వర్కౌట్‌ మానలేదా అంటూ కామెంట్‌ చేస్తే, మరికొందరు నీ పట్టుదలకు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మిమి సినిమాతో జాతీయ చలనచిత్ర అవార్డ్‌

జేపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేసిన కృతి సనన్‌ ఫ్యాషన్‌ మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. బరేలీ కి బర్ఫీ, లుకా చుప్పి సినిమాలు ఆమె బాలీవుడ్‌ కెరీర్‌ స్పీడ్‌ అందుకునేలా చేశాయి. ఈమె నటించిన దిల్‌ వాలే, హౌస్‌ ఫుల్‌ సినిమాలు భారీ వసూళ్లు సాధించడంతో వెనక్కి తిరిగి చూసే అవకాశం రాలేదు. ముఖ్యంగా ఈమె నటించిన మిమి సినిమా 2021లో విడుదలై జాతీయ చలనచిత్ర ఉత్తమ నటి అవార్డ్‌ను తెచ్చి పెట్టింది. అదే సినిమాకు ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్‌ అవార్డ్‌ను కూడా కృతి సనన్‌ అందుకుంది. ఆ సినిమాలో సరోగేట్‌ మదర్‌ పాత్రలో నటించడం ద్వారా నటనకు మంచి ఆస్కారం లభించింది. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ఎలాంటి పాత్రలు అయినా చేసేందుకు కృతి రెడీ అంటుంది.