జీక్యూ కవర్‌పేజీపై కృతి స్టన్నింగ్ లుక్
తాజాగా ప్రఖ్యాత `జీక్యూ` (GQ) మ్యాగజైన్ కవర్ పేజీపై అదిరిపోయే డిజైనర్ లుక్ తో మెరిసిపోయింది. కృతి రెడ్ టాప్- షార్ట్స్ ధరించి ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
By: Sivaji Kontham | 9 May 2026 4:00 PM ISTవెండితెరపై తన అద్భుత నటనతో కోట్లాదిమంది అభిమానుల మనసు గెలుచుకున్న నటి కృతి సనన్ ఇప్పుడు వ్యాపార రంగంలోనూ అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఇటీవల ముంబైలో జరిగిన ప్రతిష్టాత్మక `ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2026` వేడుకలో `బ్యూటీ అంట్రప్రెన్యుర్ ఆఫ్ ది ఇయర్` పురస్కారాన్ని అందుకున్నారు. కేవలం గ్లామర్ ప్రపంచానికే పరిమితం కాకుండా.. ఒక పారిశ్రామికవేత్తగా కృతి సాధిస్తున్న విజయాలు సినిమా రంగానికి ఆవల తనకు ఉన్న బలమైన పనితనాన్ని నిరూపిస్తున్నాయి. స్కిన్ కేర్ రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ కృతి ప్రారంభించిన వ్యాపార ప్రయాణం ఇప్పుడు ఒక మైలురాయిని చేరుకుంది.
కృతి సనన్ స్థాపించిన స్కిన్ కేర్ బ్రాండ్ `హైఫన్` అనతి కాలంలోనే సౌందర్య సాధనాల పరిశ్రమలో బలమైన ముద్ర వేసింది. సాధారణంగా సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా మాత్రమే వ్యవహరిస్తుంటారు.. కానీ కృతి మాత్రం అందుకు భిన్నంగా ఉత్పత్తుల అభివృద్ధి.. బ్రాండ్ విజన్ .. క్వాలిటీ కంట్రోల్ వంటి విషయాల్లో స్వయంగా పాల్గొంటున్నారు. శరీరతత్వాన్ని బట్టి హై-పెర్ఫార్మింగ్ సన్‌స్క్రీన్‌లు, బారియర్ రిపేర్ క్రీమ్‌లు - గ్లో బూస్టింగ్ సీరమ్స్ వంటి వినూత్న ఉత్పత్తులను పరిచయం చేస్తూ వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్నారు.
తన వ్యాపారాన్ని సామాన్యులకు చేరువ చేయడంలో కృతి అనుసరిస్తున్న వ్యూహాలు అద్భుతమనే చెప్పాలి. ఈ రంగంలో ఇప్పటికే పోటీపడుతున్న దీపిక పదుకొనే, కత్రిన లాంటి సీనియర్లకు భిన్నంగా కృతి తన బ్రాండ్ ని సక్సెస్ చేయడంలో సఫలమైంది. సామాన్యుల చర్మ సమస్యలను అర్థం చేసుకుంటూ.. అందరికీ అందుబాటులో ఉండే ధరలలో నాణ్యమైన ఉత్పత్తులను అందించడంలో విజయవంతమైంది. ఈ పారదర్శకతే తనను ఒక సక్సెస్ ఫుల్ అంట్రప్రెన్యుర్‌గా నిలబెట్టింది.
వ్యాపారవేత్తగా బిజీగా ఉన్నా.. కృతి తన గ్లామర్ ప్రపంచాన్ని ఏమాత్రం విస్మరించడం లేదు. తాజాగా ప్రఖ్యాత `జీక్యూ` (GQ) మ్యాగజైన్ కవర్ పేజీపై అదిరిపోయే డిజైనర్ లుక్ తో మెరిసిపోయింది. కృతి రెడ్ టాప్- షార్ట్స్ ధరించి ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సమ్మర్ కి అనుగుణంగా ఉండే విభిన్నమైన డిజైనర్ దుస్తులను ధరించి ఫోజులిచ్చింది. ఈ బ్యూటీ ఆకర్షణీయమైన రూపంతో పాటు .. తను షేర్ చేస్తున్న వ్యక్తిగత విషయాలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాను మనసున్న `రొమాంటిక్` వ్యక్తినని, ప్రేమ - సంబంధాల విషయంలో నమ్మకానికి, నిబద్ధతకు, నిజాయితీకి తాను అత్యంత ప్రాధాన్యతనిస్తానని ఈ సందర్భంగా కృతి వెల్లడించారు.
సినిమా రంగంలో అగ్ర హీరోయిన్‌గా రాణిస్తూనే.. వ్యాపార రంగంలో నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్న కృతి సనన్ ప్రయాణం బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. ఒకవైపు కళాత్మక రంగం.. మరోవైపు సాంకేతికతతో కూడిన స్కిన్ కేర్ బిజినెస్.. రెండింటినీ సమతుల్యం చేస్తూ ఈ బ్యూటీ సాగిస్తున్న ప్రస్థానం నేటి యువతకు గొప్ప స్ఫూర్తినిస్తోంది. పట్టుదల.. స్పష్టమైన విజన్ ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని కృతి సనన్ నిరూపిస్తున్నారు. 2026లో కృతి అందుకున్న ఈ పురస్కారం కెరీర్‌లో మరొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది.
కాక్ టెయిల్ 2లో కృతి సనన్ నయా గ్లామర్*
2026 జూన్ 19న విడుదల కాబోతున్న `కాక్ టెయిల్ 2` చిత్రంలో కృతి సనన్ అల్లీ అనే అత్యంత స్టైలిష్- బోల్డ్ పాత్రలో కనిపిస్తోంది. ఈ సినిమా 2012 నాటి ఒరిజినల్ చిత్రానికి సీక్వెల్ కాకపోయినా అదే తరహా ఆధునిక స్నేహబంధాలు.. క్రిటికల్ ప్రేమ కథాంశంతో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలలో కృతి లుక్స్ చూస్తుంటే తన కెరీర్‌లోనే అత్యంత గ్లామరస్ పాత్రను పోషిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా షాహిద్ కపూర్‌తో ఈ బ్యూటీ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇది వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రం కావడం విశేషం.
హోమీ అదజానియా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో కృతి పాత్ర కేవలం అందానికే పరిమితం కాకుండా.. భావోద్వేగాల పరంగా కూడా ఎంతో డెప్త్ తో ఉంటుందని సమాచారం. రష్మిక మందన్నతో కలిసి కృతి చేసే సందడి .. నేటి తరం యువత ఆలోచనా ధోరణిని ప్రతిబింబించే నటన సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. అల్లీ పాత్ర తో కృతి సనన్ ఒక అర్బన్ ఐకాన్‌గా తనదైన ముద్ర వేయడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద తన సత్తాను మరోసారి చాటుకోవడానికి సిద్ధమవుతోంది.
