సనన్ సిస్టర్స్ ట్రెడిషనల్ మ్యాజిక్.. సాంప్రదాయ చీరల్లో కృతి, నుపూర్ సందడి!
ఒకేలా కాకుండా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లలో పద్ధతిగా ముస్తాబై వీరు ఇచ్చిన పోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఆ విశేషాలు మీకోసం..
By: Madhu Reddy | 18 Sept 2026 1:00 PM ISTబాలీవుడ్ స్టార్ సిస్టర్స్ కృతి సనన్, నుపూర్ సనన్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. ఇటీవల జరిగిన అంబానీ ఇంటి గణేష్ చతుర్థి వేడుకలకు హాజరైన ఈ అక్కాచెల్లెళ్లు, సరికొత్త మోడలింగ్ స్టైల్ ఉన్న బంధేజ్ చీరల్లో దేవకన్యల్లా మెరిసిపోయారు. ఒకేలా కాకుండా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లలో పద్ధతిగా ముస్తాబై వీరు ఇచ్చిన పోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఆ విశేషాలు మీకోసం..
మనీష్ మల్హోత్రా డిజైనర్ చీరల్లో సనన్ సిస్టర్స్:
ఈ ప్రత్యేక వేడుక కోసం కృతి, నూపుర్ ఇద్దరూ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా రూపకల్పన చేసిన కస్టమ్ బంధేజ్ చీరలను ఎంచుకున్నారు. ఇక కృతి సనన్ రాయల్ బ్లూ పర్పుల్ కలర్ బంధేజ్ చీరకు మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్, క్లాసిక్ చోకర్ నెక్లేస్, హెయిర్ బన్ జత చేసి రాయల్ లుక్‌లో కనిపించింది. ఇక నూపుర్ సనన్ ఆలివ్ గ్రీన్ బంధేజ్ చీర, ఆఫ్-షోల్డర్ బ్లౌజ్, 'గోలేచా జ్యువెల్స్' ఆభరణాలతో ఎంతో క్యూట్‌గా మెరిసిపోయింది.
"ట్విన్నింగ్ వితౌట్ ట్విన్నింగ్" అంటూ క్యాప్షన్ :
ఈ అద్భుతమైన పిక్స్ పంచుకుంటూ సనన్ సిస్టర్స్ "ఒకేలా కనిపించకుండానే ఎలా మ్యాచింగ్ చేయాలో చెప్పే సనన్ సిస్టర్స్ హ్యాక్ 101" అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు. సాంప్రదాయ క్రాఫ్ట్‌తో పాటు మోడర్న్ కట్స్‌తో ఉన్న ఈ లుక్స్ చూసి అభిమానులు "బ్యూటిఫుల్", "క్యూటీస్", "పర్ఫెక్ట్ సిస్టర్ గోల్స్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కృతి సనన్ నేషనల్ క్రేజ్ అండ్ సక్సెస్:
బాలీవుడ్‌లో 'మిమి' చిత్రంతో జాతీయ అవార్డు గెలుచుకున్న కృతి, 'హౌస్‌ఫుల్ 4', 'బేడియా', 'కాక్‌టెయిల్ 2' వంటి చిత్రాలతో అలరించింది. పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్'లో ప్రభాస్ సరసన 'జానకి' (సీత) పాత్రలో నటించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
నూపుర్ సనన్ ఎంట్రీ అండ్ పర్సనల్ లైఫ్ :
అక్షయ్ కుమార్‌తో చేసిన 'ఫిల్హాల్' మ్యూజిక్ వీడియోతో ప్రాచుర్యంలోకి వచ్చిన నూపుర్, 'పాప్ కౌన్?' సిరీస్‌తో అలరించింది. మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో సారా పాత్రలో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఇక వ్యక్తిగత జీవితానికొస్తే నూపుర్ వివాహం ప్రముఖ సింగర్ స్టీబిన్ బెన్‌తో ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. ఇక ఒకరికొకరు తోడుగా నిలుస్తూ బెస్ట్ సిస్టర్ గోల్స్‌గా నిలిచే కృతి-నూపుర్‌లు, సోషల్ మీడియాలోనే కాకుండా సినిమాల్లోనూ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
