పవన్ హీరోయిన్ హాఫ్ షోల్డర్ ఫ్రాక్ కిరాక్
పవన్ కల్యాణ్ సరసన `తీన్ మార్` చిత్రంలో నటించింది కృతి కర్భంద. ఆ తర్వాత సుమంత్ `బోణి`లో నటించింది. ఈ రెండు అవకాశాలు తనకు ఏ విధంగాను కలిసి రాలేదు.
By: Sivaji Kontham | 29 Nov 2025 4:00 AM ISTపవన్ కల్యాణ్ సరసన `తీన్ మార్` చిత్రంలో నటించింది కృతి కర్భంద. ఆ తర్వాత సుమంత్ `బోణి`లో నటించింది. ఈ రెండు అవకాశాలు తనకు ఏ విధంగాను కలిసి రాలేదు. అవి రెండూ ఫ్లాపులుగా మిగలడంతో ఆ తర్వాత బాలీవుడ్ లో కెరీర్ కోసం ప్రయత్నించింది. కానీ అక్కడ కూడా అంతంత మాత్రమే. అక్షయ్ హౌస్ ఫుల్ 4 లాంటి క్రేజీ మూవీలో నటించింది. అక్షయ్-పూజ.. తుషార్-కృతి సనోన్ .. బాబీ డియోల్- కృతి కర్బంద జంటల మధ్య పునర్జన్మల కథ తో తెరకెక్కిన ఈ చిత్రం అడల్ట్ కంటెంట్ కారణంగా, విమర్శల పాలైంది. అయినా బాక్సాఫీస్ వద్ద బాగానే వసూలు చేసింది. ప్రస్తుతం `రిస్కీ రోమియో` అనే చిత్రంలో నటిస్తోంది. కానీ ఈ సినిమా గురించిన సరైన వివరాలు వెల్లడి కాలేదు.
కృతి ఇటీవల పూర్తిగా తన భర్త, కుటుంబంతో గడిపేందుకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తోంది. ఇటీవల ఈత కొలను వద్ద తన భర్త పుల్కిత్ సామ్రాట్ తో పాటు కనిపించింది. ప్రతిసారి భర్తతో కలిసి వెకేషన్స్ ప్లాన్ చేయడంలోను కృతి బిజీగా ఉంది. పుల్కిత్ ని సల్మాన్ ఖాన్ స్వయంగా హీరోగా పరిచయం చేయగా.. ఆరంభం రోహిరాతో డేటింగ్ చేశాడు. పాత గాళ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పి తర్వాత కృతితో ప్రేమాయణం ప్రారంభించాడు. అదే సమయంలో కృతి కెరీర్ పరంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తూ, `వాన్` అనే తమిళ చిత్రం సహా హిందీలో `థైస్`.. `14 పెరే` అనే రెండు చిత్రాలతో బిజీ అయింది. కానీ ఇవేవీ తన భవిష్యత్ కి ఉపయోగపడలేదు.
కృతి కర్బంద ఇతర వ్యాపకాలను పరిశీలిస్తే, ఇటీవల గ్లోబల్ స్పా కవర్ స్టార్ గా మారింది. దానికి సంబంధించిన ఫోటోషూట్ కూడా రివీలైంది. ఇప్పుడు అడపాదడపా తన కొత్త లుక్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ని కృతి ఇన్ స్టాలో షేర్ చేస్తుంటే అవన్నీ వైరల్ గా మారతున్నాయి. తాజాగా హాఫ్ షోల్డర్ ఫ్రాక్ లో కృతి అందాల ఎలివేషన్ యువతరంలో గుబులు పెంచుతోంది. మెరూన్ కలర్ ఫ్రాక్ ధరించిన కృతి, `వీ` లుక్ లో తన అందాలను ఎలివేట్ చేసింది. ఇక ఆ మెడలో లైట్ వెయిట్ పెండెంట్ ఎంతో అందంగా కనిపిస్తోంది.
కృతి తనకు ఎలాంటి సినిమాల్లో నటించాలనుంది? అనేది ప్రశ్నిస్తే, దేవదాస్ రీమేక్ లో నటిస్తానని సమాధానమిచ్చింది. ఆదర్శవంతమైన రోజు సెలవు ఎలా ఉంటుందో కూడా కృతి వివరించింది. ఆశ్చర్యకరంగా ఆరోజు తన భర్త పుల్కిత్ సామ్రాట్ తనతో ఉండాలని చెప్పింది. నేను అతడితో పాడిల్ - పికిల్ ఆడటం ఇష్టపడతాను.. అని తెలిపింది. ఒక క్లాసిక్ సినిమా రీమేక్‌లో నటించే అవకాశం ఎప్పుడైనా లభిస్తే, రొమాంటిక్ డ్రామా దేవదాస్ ని ఎంపిక చేసుకుంది.
