Begin typing your search above and press return to search.

కృతి ఎమోషనల్.. అర్ధం చేసుకోవాల్సిందే..!

ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు స్పీడ్ స్పీడ్ గా అరడజను సినిమాలు చేసింది.

By:  Ramesh Boddu   |   8 Dec 2025 1:16 PM IST
కృతి ఎమోషనల్.. అర్ధం చేసుకోవాల్సిందే..!
X

తొలి సినిమా సూపర్ హిట్టైతే ఆ హీరోయిన్ కి వచ్చే క్రేజ్ ఎలా ఉంటుందో అంతకు రెట్టింపు బాధ్యత కూడా ఉంటుంది. వచ్చీ రాగానే బ్లాక్ బస్టర్ కొడితే ఆ నెక్స్ట్ అంతకు మించిన సినిమా చేయాలి. కానీ అనుభవ లేమి వల్ల హిట్ పడింది కదా అని వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ వెళ్తే చివరకు కెరీర్ కొన్నాళ్లకే ఎండ్ కార్డ్ పడే పరిస్థితి వస్తుంది. ఐతే కెరీర్ ఎండ్ అవ్వలేదు కానీ ఉప్పెన భామ కృతి శెట్టి పరిస్థితి దాదాపు అలానే ఉంది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు స్పీడ్ స్పీడ్ గా అరడజను సినిమాలు చేసింది.

కృతి శెట్టి పై ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్..

ఐతే అవి పూర్తయ్యాక తను తప్పు చేసిందని తెలుసుకుంది. ఐతే ఈ క్రమంలో తనపై ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ ఎటాక్ చేశాయి. ఐతే కెరీర్ లో చాలా చిన్న వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం తొలి సినిమా సూపర్ హిట్ అవ్వడం ఆ తర్వాత వరుస ఫ్లాపులు పడటం ఇవన్నీ కృతి విషయంలో చక చకా జరిగాయి. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యింది కృతి శెట్టి.

చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో చాలా రకాల విమర్శలు, నెగిటివిటీ ఫేస్ చేశానని అన్నది కృతి శెట్టి. అంతేకాదు తన పరంగా బెస్ట్ ఇస్తున్నా సరే ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటున్నా అన్నది కృతి. ఈ టైంలో తన మదర్ సపోర్ట్ గా ఉన్నారని స్నేహితులు కూడా సపోర్ట్ చేశారని ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంది కృతి శెట్టి. అంతేకాదు తను ఎమోషనల్ అవుతూ చిన్న బ్రేక్ అవసరం అనుకుంటా అని అన్నది కృతి.

ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు..

తొలి సినిమా సక్సెస్ పడ్డాక ఆ ఇంపాక్ట్ వల్ల నెక్స్ట్ ఎలాంటి మైండ్ సెట్ ఉంటుందో తెలిసిందే. కథల జడ్జిమెంట్ కరెక్ట్ గానే అనిపిస్తాయి కానీ రిజల్ట్ వేరేలా ఉంటుంది. కృతి శెట్టి విషయంలో అలానే జరిగింది. ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు ఈ సినిమాలు తప్ప నెక్స్ట్ వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. అందుకే అమ్మడు ఇప్పుడు కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ సత్తా చాటాలని చూస్తుంది అమ్మడు.

తమిళ్ లో రవి మోహన్ తో జినీ, ప్రదీప్ రంగనాథన్ తో LIK సినిమాలు చేసిన కృతి శెట్టి కార్తితో అన్న గారు వస్తున్నారు సినిమాలో కూడా నటించింది. తమిళ్ లో తన కెరీర్ బాగుండాలంటే అమ్మడు ఈ సినిమాలతో ఇంపాక్ట్ చూపించాల్సి ఉంటుంది. తెలుగులోనే మనమే తర్వాత అసలు ఆఫర్లు దక్కించుకోలేదు కృతి శెట్టి ఐతే ఇప్పటికీ తెలుగులో తనకో ఛాన్స్ వస్తే టాలెంట్ చూపించాలని చూస్తుంది.