బేబమ్మకు నిరాశ తప్పట్లేదుగా!
అందుకే తమిళంలో తన లక్ ను టెస్ట్ చేసుకుందామని కోలీవుడ్ కు వెళ్లిన కృతికి ఆ టెస్టింగ్ టైమ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది.
By: Sravani Lakshmi Srungarapu | 11 Dec 2025 7:09 PM ISTకృతి శెట్టి. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుని కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కృతి మొదటి సినిమాతోనే విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఉప్పెన సినిమాతో వచ్చిన క్రేజ్ వల్ల కృతికి ఆఫర్లు కూడా క్యూ కట్టాయి. కానీ ఎన్ని ఆఫర్లు వచ్చినా కృతికి అవేవీ తన స్టార్‌డమ్ ను పెంచుకోవడానికి ఉపయోగపడలేదు.
మరోసారి వాయిదా పడ్డ కృతి సినిమాలు
దీంతో క్రమంగా కృతికి తెలుగులో ఆఫర్లు తగ్గాయి. అందుకే తమిళంలో తన లక్ ను టెస్ట్ చేసుకుందామని కోలీవుడ్ కు వెళ్లిన కృతికి ఆ టెస్టింగ్ టైమ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ప్రస్తుతం కీర్తి చేతిలో మూడు తమిళ సినిమాలున్నాయి. వాటిలో రెండు సినిమాలు డిసెంబర్ లోనే రిలీజవాల్సి ఉండగా ఆ రెండు సినిమాలూ వాయిదా పడ్డాయి.
కార్తీ హీరోగా తెరకెక్కిన వా వాతియార్, ప్రదీప్ రంగనాథన్ హీరోగా రూపొందిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలు డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఇప్పుడా రెండు సినిమాలూ వాయిదా పడ్డాయి. ఇక మూడో సినిమా జీనీ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఎలాగూ డిసెంబర్ లో రెండు సినిమాలు రిలీజవుతున్నాయి కదా వాటితో హిట్ అందుకుని 2025కి సక్సెస్‌తో గుడ్ బై చెప్దామనుకున్న కృతికి మరోసారి నిరాశే మిగిలింది.
ఏదేమైనా కోలీవుడ్ డెబ్యూ కోసం కృతి ఎదురుచూస్తున్న కొద్దీ అది వాయిదా పడుతూనే ఉందనేది మాత్రం వాస్తవం. ప్రస్తుతం కెరీర్లో బిగ్గెస్ట్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న కృతి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా కూడా తన గ్లామర్ తో నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. మరి కృతి నిరీక్షణ ఫలించి ఆమె సక్సెస్ ట్రాక్ ఎప్పుడు ఎక్కుతుందో చూడాలి.
