చైతూ ఎంతో నిజాయితీపరుడు.. సర్టిఫికేట్ ఇచ్చేసిన యంగ్ హీరోయిన్
ఉప్పెన తర్వాత వచ్చిన క్రేజ్, ఫాలోయింగ్ తనకు అవకాశాలనైతే తెచ్చిపెట్టాయి కానీ ఆ క్రేజ్ ను ఏ మాత్రం పెంచలేకపోయాయి.
By: Sravani Lakshmi Srungarapu | 8 Dec 2025 12:31 PM ISTప్రతీ వారం కొందరు కొత్త హీరోయిన్లు సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఓ వారం ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న భామ కృతి శెట్టి. ఉప్పెన మూవీతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన కృతి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఆ స్టార్‌డమ్ తోనే కృతికి వరుస అవకాశాలొచ్చాయి. కానీ ఆ ఛాన్సులేవీ కృతిని స్టార్ హీరోయిన్ ను చేయలేకపోయాయి.
కోలీవుడ్ లో లక్ ను టెస్ట్ చేసుకుంటున్న కృతి
ఉప్పెన తర్వాత వచ్చిన క్రేజ్, ఫాలోయింగ్ తనకు అవకాశాలనైతే తెచ్చిపెట్టాయి కానీ ఆ క్రేజ్ ను ఏ మాత్రం పెంచలేకపోయాయి. ఫలితంగా కొంతకాలం తర్వాత కృతికి తెలుగులో ఆఫర్లు తగ్గాయి. దీంతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తన లక్ ను టెస్ట్ చేసుకుంటున్నారు కృతి. అయితే కృతి నటించిన రెండు తమిళ సినిమాలు ఇప్పుడు ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాయి.
ఒకే నెలలో కృతి నుంచి రెండు సినిమాలు
వాటిలో ఒకటి విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాగా, రెండోది నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న వా వాతియార్ (అన్న గారు వస్తారు). ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ లో కృతి చాలా యాక్టివ్ గా పాల్గొంటుండగా రీసెంట్ గా ఆమెకు ప్రమోషన్స్ లో ఓ ప్రశ్న ఎదురైంది.
మీరు ఇప్పటివరకు వర్క్ చేసిన వాళ్లలో మీకు ఎక్కువ కంఫర్టబుల్ గా అనిపించేది ఎవరితో అని అడగ్గా వెంటనే ఆమె నాగచైతన్య పేరు చెప్పేశారు. నాగచైతన్య చాలా నిజాయితీపరుడని, ఆయనెప్పుడూ ఎలాంటి ఫిల్టర్లు లేకుండా చాలా హానెస్ట్ గా ఉంటారనిపిస్తుందని, కృతి చెప్పుకొచ్చారు. ఇప్పటికే చైతన్య మంచితనం గురించి ఎంతో మంది పలు సందర్భాల్లో మాట్లాడగా, ఇప్పుడు కృతి కూడా ఈ అక్కినేని హీరోకు మంచి సర్టిఫికేట్ ఇచ్చారు.
