ఒకరితోనే డేటింగ్ అతడితోనే పెళ్లి!
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి వ్యక్తిగత జీవితంపై పూర్తి క్లారిటీతో ఉందా? అంటే అవుననే అనాలి.
By: Srikanth Kontham | 11 April 2026 6:00 AM ISTఉప్పెన బ్యూటీ కృతి శెట్టి వ్యక్తిగత జీవితంపై పూర్తి క్లారిటీతో ఉందా? అంటే అవుననే అనాలి. నేటి తరం యువత డేటింగ్ సంస్కృతిపై భిన్నమైన అభిప్రాయాలతో ఉన్నప్పటికీ కృతి మాత్రం పాత తరం విలువలకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది. తాను ఎవరితోనైనా డేటింగ్ చేస్తే? అది కేవలం పెళ్లి కోసమే ఉంటుందని ఒకరితోనే ప్రేమ.. అతడితోనే జీవితం అనే సూత్రాన్ని తాను నమ్ముతానని వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు ఆమెలోని పరిణతిని, సంప్ర దాయాల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుతున్నాయి. ప్రేమ , పెళ్లి విషయంలో కృతి శెట్టికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్నట్లు కనిపిస్తుందని ఆమె మాటలతో అర్దమవుతుంది.
ప్రస్తుతానికి కృతిశెట్టి దృష్టి సినిమాలపైనే ఉందని మరో ఐదేళ్ల వరకు ప్రేమ లేదా పెళ్లి అనే ఆలోచనే తన దరిదాపుల్లోకి రాదని స్పష్టం చేసింది. ఐదేళ్ల తర్వాత మాత్రమే తన వ్యక్తిగత జీవితం గురించి ఒక నిర్ణయం తీసుకుంటానని అప్పటి వరకు తన శక్తిని, సమయాన్ని నటనకే కేటాయిస్తానని పేర్కొంది. ప్రేమ అనేది ఒక బాధ్యత అని సరదా కోసం చేసే పని కాదని కృతి అభిప్రాయపడింది. తాను పెళ్లాడబోయే వ్యక్తి తనను అర్థం చేసుకునేవాడై, తన వృత్తిని గౌరవించే వాడై ఉండాలంది. డేటింగ్ పేరుతో సమయాన్ని వృధా చేయడం కంటే ఒకే వ్యక్తితో బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడమే ఉత్తమమని అమ్మడు నమ్ముతోంది.
గ్లామర్ ప్రపంచంలో ఉంటూ ఇంతటి స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండటం విశేషం. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి స్పష్టత ఉండటం వల్ల వృత్తిపరంగా ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకునే అవకాశం ఉంది. చాలామంది నటీమణులు కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు రూమర్ల బారిన పడుతుంటారు. అయితే కృతి శెట్టి ముందే ఇలాంటి ప్రకటన చేయడం ద్వారా అనవసరమైన గాసిప్స్‌కు చెక్ పెట్టినట్లయింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్న మంగళూరు భామ నటనతో ప్రేక్షకులను మెప్పించడమే పరమావధిగా భావిస్తుంది.
కృతి శెట్టి కెరీర్ పై ఉన్న స్పష్టతతో ఇటు నిర్మాతలకు, అటు అభిమానులకు ఒకరకమైన భరోసా ఇచ్చినట్లే. ఐదేళ్ల పాటు కేవలం వెండితెరపైనే కనిపిస్తానని చెప్పడం ఆమె అంకితభావాన్ని సూచిస్తోంది. దీంతో నిర్మాతలు నిశ్చింతగా సినిమాలు చేసుకోవచ్చు. కృతి శెట్టి ఫాలోవర్స్ అమ్మడి కోస ప్రయత్నాలు చేయోచ్చు. ఈ బ్యూటీ నటించిన ఎల్ ఐ కె సినిమా కొన్ని గంటల క్రితమే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంపై అమ్మడు చాలా ఆశలే పెట్టుకుంది. అలాగే తెలుగులోనూ ఓ అగ్ర హీరో ప్రాజెక్ట్ కు సైన్ చేసింది.
