కృతికి ఇదే లాస్ట్ ఛాన్స్!
టాలీవుడ్‌లో ఎంట్రీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్‌గా గుర్తింపు పొందిన కృతి శెట్టి ప్రస్తుతం కెరీర్లో కఠిన దశను ఎదుర్కొంటోంది.
By: Sravani Lakshmi Srungarapu | 15 April 2026 10:52 AM ISTటాలీవుడ్‌లో ఎంట్రీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్‌గా గుర్తింపు పొందిన కృతి శెట్టి ప్రస్తుతం కెరీర్లో కఠిన దశను ఎదుర్కొంటోంది. ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆమెకు, ఆ తరువాత వరుస ఆఫర్లొచ్చాయి. వాటిలో బంగార్రాజు, శ్యామ్ శింగరాయ్ తప్ప మిగిలినవన్నీ ఫ్లాపులవడంతో డౌన్‌ఫాల్‌ను చూసింది. టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో, కొత్త అవకాశాల కోసం కోలీవుడ్ వైపు అడుగులు వేసిన కృతి, అక్కడైనా తన లక్ మారుతుందనే ఆశ పెట్టుకుంది. అయితే, అక్కడ కూడా ఆమెకు ఆశించిన ఫలితాలు దక్కకపోవడం గమనార్హం. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా మొదలైన ఆమె ప్రయాణం, ఇప్పుడు స్ట్రగుల్ ఫేజ్‌గా మారడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
కోలీవుడ్ లోనూ ఫ్లాపులే..
అయితే టాలీవుడ్ లో లక్ కలిసి రావడం లేదని, కోలీవుడ్‌కి వెళ్లి చేసిన తాజా ప్రయత్నాలు కూడా కృతికి నిరాశనే మిగిల్చాయి. వా వాతియార్ లో కార్తీతో జోడీగా కనిపించినా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. తరువాత రీసెంట్ గా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రదీప్ రంగనాథన్ తో కలిసి నటించినా, ఆ ప్రాజెక్ట్ కూడా విజయాన్ని అందించలేకపోయింది. ముఖ్యంగా విఘ్నేష్ శివన్ లాంటి డైరెక్టర్ తో పని చేసినా హిట్ రాకపోవడం, కృతి కెరీర్‌పై మరింత ప్రభావం చూపింది. మంచి బ్యానర్లు, పేరున్న నటులతో సినిమాలు చేసినా ఫలితం లేకపోవడంతో కృతికి ప్రతీసారీ నిరాశ తప్పడం లేదు.
మళ్లీ టాలీవుడ్‌పైనే కన్నేసిన కృతి
ఇలాంటి పరిస్థితుల్లో, ఇప్పుడు కృతి శెట్టి దృష్టి మళ్లీ టాలీవుడ్‌పై పడింది. ఈ క్రమంలో ఆమెకు లభించిన అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ అత్యంత కీలకంగా మారింది. వరుస హిట్స్‌తో హిట్ మెషీన్ గా పేరు తెచ్చుకున్న ఆయన దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన కృతి నటించనుంది. ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమం కమర్షియల్ హిట్ గ్యారంటీ అనే నమ్మకం ఉండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి. కృతి కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌పైకి తీసుకురాగలిగే అవకాశమున్న ఈ సినిమా, ఆమెకు నిజమైన కంబ్యాక్ ఛాన్స్ గా మారింది.
హీరోయిన్స్ కెరీర్‌లో ఇండస్ట్రీ మార్పులు సాధారణమే అయినా, టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు, మళ్లీ కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కు అనే కృతి జర్నీ ఇప్పుడొక స్ట్రాటజిక్ మూమెంట్‌గా కనిపిస్తోంది. సరైన టైంలో సరైన ప్రాజెక్ట్ పడితే కెరీర్ ఎలా తిరగబడుతుందో ఇండస్ట్రీలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడదే మ్యాజిక్ కృతి విషయంలోనూ పనిచేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ కృతి కెరీర్‌కు లాస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా అయినా ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.
