Begin typing your search above and press return to search.

ట్రెండింగ్లో కళ్యాణి, కృతి శెట్టి.. మెస్మరైజ్ చేస్తున్న బెల్లీ డాన్స్!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   8 Oct 2025 11:41 AM IST
ట్రెండింగ్లో కళ్యాణి, కృతి శెట్టి.. మెస్మరైజ్ చేస్తున్న బెల్లీ డాన్స్!
X

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అటు కళ్యాణి ప్రియదర్శన్ ఇటు కృతి శెట్టి ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసారు. సడన్ గా ఇద్దరూ కలిసి ట్రెండింగ్ లోకి రావడానికి గల కారణం ఏమిటి ? అని తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోకమానరు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల లోకా చాప్టర్ 1: చంద్ర సినిమాతో సంచలన విజయం అందుకున్న కళ్యాణి ప్రియదర్శన్.. మరో యంగ్ బ్యూటీస్ కృతి శెట్టి, వామికా గబ్బి హీరోయిన్ లతో కలసి తాజాగా నటిస్తున్న తమిళ చిత్రం జీని. రవి మోహన్ హీరోగా వస్తున్న ఈ చిత్రానికి అర్జునన్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై 25వ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ చిత్రాన్ని డా. దాసరి కె. గణేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటుండగా.. తెలుగు, తమిళ్ , కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాట "అబ్డి.. అబ్డి" పాట విడుదలయ్యింది. ఈ పాట సోషల్ మీడియాలో విడుదలైన ఐదు నిమిషాలలోనే ఈ పాటలో నటించిన కళ్యాణి ప్రియదర్శన్, కృతి శెట్టి ట్రెండింగ్ లోకి వచ్చేసారు. కారణం ఇక్కడ వీరు చేసిన బెల్లీ డాన్స్. రెడ్ కలర్ డ్రెస్ ధరించి తమ నడుము చూపిస్తూ.. కుర్ర కారుకు హీటు పుట్టించేలా బెల్లీ డాన్స్ తో అదరగొట్టేశారు. అటు రవి మోహన్ కూడా వీరిద్దరి డాన్స్ పెర్ఫార్మెన్స్ కి పోటీగా తమ డాన్స్ తో అలరించారు. ఇకపోతే కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ ఇద్దరూ కూడా ఈ బెల్లీ డాన్స్ మూమెంట్లను ఇక్కడ సులభంగా ప్రదర్శించినా.. దీని వెనుక కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచిన ఈ పాటపై కళ్యాణి ప్రియదర్శన్ స్పందిస్తూ.. "నేను నటిగా ఎప్పుడు చేయని పనులు కూడా చేయడానికి ఇప్పుడు సిద్ధం అవుతున్నాను. ఇది నాకు అతి పెద్ద సవాలుగా మారింది. ఈ పాట అలాంటి క్షణాలలో ఒకటి. మా దర్శకుడు దాని గురించి నాకు చెప్పినప్పుడు.. అతను మంచి వాణిజ్య సంగీత భాగాన్ని జీని సినిమాలో ఎంత చక్కగా తీర్చిదిద్దాడో చూసి ఆశ్చర్యపోయాను. మీరందరూ దానిని సినిమాలో చూసేవరకు నేను కూడా వేచి ఉండలేను. దాని వెనుక ఉన్న కారణాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాము. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని భావిస్తున్నాం" అంటూ తెలిపింది. మొత్తానికైతే జీని సినిమా కోసం అటు కళ్యాణి ప్రియదర్శన్ ఇటుకృతి శెట్టి ఇద్దరూ కూడా బెల్లీ డాన్స్ తో అదరగొట్టేశారు. ముఖ్యంగా ఈపాటే ఇప్పుడు ఈ సినిమాకు మరింత ప్లస్ గా మారనుంది అని చెప్పవచ్చు.