Begin typing your search above and press return to search.

కృతి ఇక వాటికి కూడా సై అనేస్తుందా..?

ఉప్పెనతో తెరంగేట్రం తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోయిన్ కృతి శెట్టి ఆ సినిమా ఇచ్చిన పుష్ తో ఏకంగా అరడజను సినిమాలు ఆగకుండా చేసింది.

By:  Ramesh Boddu   |   20 Nov 2025 3:00 PM IST
కృతి ఇక వాటికి కూడా సై అనేస్తుందా..?
X

ఉప్పెనతో తెరంగేట్రం తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోయిన్ కృతి శెట్టి ఆ సినిమా ఇచ్చిన పుష్ తో ఏకంగా అరడజను సినిమాలు ఆగకుండా చేసింది. మొదటి సినిమా తర్వాత వచ్చిన శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు అమ్మడిని ఒడ్డున పడేసినా నెక్స్ట్ ఇక చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక వరుస ఫ్లాపుల వల్ల కృతి శెట్టికి ఛాన్స్ లు కూడా కరువయ్యాయి. చివరగా శర్వానంద్ తో కృతి శెట్టి చేసిన మనమే సినిమా కూడా డిజప్పాయింట్ చేయడంతో అమ్మడు ఇక మరింత రిస్క్ లో పడింది.

రవి మోహన్ తో జినీ.. ప్రదీప్ రంగనాథన్ తో L.I.K..

తెలుగులో అవకాశాలు లేవు కానీ తమిళ్ లో కృతి శెట్టికి ఛాన్స్ లు వచ్చాయి. అక్కడ రవి మోహన్ తో జినీ సినిమా చేస్తున్న కృతి శెట్టి ప్రదీప్ రంగనాథన్ తో L.I.K కూడా చేసింది. ఈ రెండు సినిమాలు కూడా డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్నాయి. తమిళ్ లో తన కెరీర్ బాగుండాలి అంటే కృతి శెట్టి ఈ సినిమాలతో కచ్చితంగా హిట్టు కొట్టాల్సిందే. ఐతే ఈమధ్య అమ్మడు ఫోటో షూట్స్ లో కూడా గ్లామర్ షోతో అదరగొట్టేస్తుంది.

కృతి శెట్టి ఫోటో షూట్స్ ఎప్పుడూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. ఐతే తనకు తొలి హిట్ ఇచ్చిన టాలీవుడ్ ని దూరం చేసుకోవడం ఇష్టం లేని అమ్మడు ఎలాంటి అవకాశం ఇచ్చినా నాకు ఓకే అనేస్తుందట. ప్రస్తుతం లీడ్ హీరోయిన్ ఛాన్స్ లు కష్టమని భావించిన కృతి శెట్టి స్టార్ సినిమాల్లో ఒక స్పెషల్ సాంగ్ ఛాన్స్ ఇచ్చినా చేయడానికి నేను రెడీ అంటుందట. కృతి శెట్టి స్పెషల్ సాంగ్ చేస్తే ఇప్పుడు అమ్మడు చేస్తున్న గ్లామర్ ఫోటో షూట్స్ కి పర్ఫెక్ట్ ఆప్షన్ అనేలా ఉంటుంది.

కృతి వరుస ఫెయిల్యూర్స్..

కృతి శెట్టి కూడా ఇండస్ట్రీలో ఎప్పుడూ మనం అనుకున్న ఆఫర్లు రావడం కష్టం. ఒక్కోసారి అవకాశాలు వస్తున్న మార్గంలో మనం వెళ్లాల్సిందే అన్నట్టుగా ఆలోచిస్తుందట. మరి అమ్మడు నిజంగానే స్పెషల్ సాంగ్స్ కి సై అంటుందా లేదా అన్నది చూడాలి. ఉప్పెనతో తెలుగు తెరకు మరో టాలెంటెడ్ క్యూట్ లుక్స్ హీరోయిన్ వచ్చిందని అనుకున్న ఆడియన్స్ అంతా కృతి ఫెయిల్యూర్స్ చూసి అవాక్కవుతున్నారు. తెలుగులో ఒకే ఒక్క ఛాన్స్ కోసం కృతి శెట్టి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఐతే ఆ ఛాన్స్ ఇచ్చి ఆమెను ఎవరు ఎంకరేజ్ చేస్తారన్నది చూడాలి.

ఎలాగు కృతి శెట్టి చేస్తున్న ఎల్.ఐ.కె తెలుగులో కూడా రిలీజ్ ఛాన్స్ ఉంటుంది. సో అలా అయినా తెలుగు ఆడియన్స్ ముందుకు మరోసారి అమ్మడు తన టాలెంట్ చూపించే అవకాశం అందుకుంటుంది.