సక్సెస్ అయితేనే కృతిశెట్టికి కలిసొచ్చేది!
కృతి శెట్టి టాలీవుడ్ ..కోలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం, ట్యాలెంట్ ఉన్నా?టాలీవుడ్ లో అవకాశాలు అందుకోవడంలో విఫలమైంది.
By: Srikanth Kontham | 30 March 2026 9:00 PM ISTకృతి శెట్టి టాలీవుడ్ ..కోలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం, ట్యాలెంట్ ఉన్నా?టాలీవుడ్ లో అవకాశాలు అందుకోవడంలో విఫలమైంది. దీంతో కోలీవుడ్ లో కూడా అదృష్టాన్నిపరీక్షించుకుంది. అక్కడా అదే పరిస్థితి. కాకపోతే? తెలుగు కంటే తమిళ్ లో మెరుగ్గా కనిపిస్తోంది. సినిమా ప్లాప్ అయినా మరో ఛనా్స్ అందుకోగల్గుతుంది. అక్కడైనా ఇలా ఎంత కాలం? దీంతో అమ్మడి కెరీర్ హిట్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కృతి శెట్టి ఆశలన్నీ తాజా చిత్రం `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` పైనే ఉన్నాయి. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకె క్కుతోన్న ఈ సినిమాపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి బజ్ ఏర్పడింది. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా గెస్ట్ రోల్ పోషించడం సినిమాకు కీలకంగా మారింది. ప్రత్యేకించి కృతి శెట్టికి తమిళంలో పెద్ద బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుందని ఎంతో ధీమాతో ఉంది. ఈ విషయంలో మేకర్స్ కూడా అంతే కాన్పిడెంట్ గా ఉన్నారు. `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` సూపర్ హిట్ అయితే కృతి గ్రాఫ్ మళ్లీ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. సినిమా గనుక ఆశించిన స్థాయిలో ఆడకపోతే? కృతి శెట్టి కెరీర్ మరిన్ని ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది.
ఇప్పటికే కొత్త కథానాయికల నుంచి పోటీ పెరగడం, పాన్-ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుండటంతో, పాత ఫామ్‌ను అందుకోవడం అమ్మడికి సవాలుగా మారింది. తమిళంలో విజయం సాధిస్తేనే తెలుగు మేకర్స్ ఆమె వైపు మళ్లీ చూసే పరిస్థితి కనిపిస్తోంది. లేకపోతే చిన్న సినిమాలకే పరిమితం కావాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కృతిశెట్టి మాత్రం తనలో స్కిల్స్ ను మెరుగు పరుచుకుంటుంది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది.
ఈ నేపథ్యంలో`లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` విజయం ఓ టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశీస్తుంది. తమిళ తంబీలు అమ్మడిని ఆదరిస్తే ఆ వేడి టాలీవుడ్‌కు తాకుతుందనడంలో సందేహం లేదు. చివరిగా ఈ సినిమా కృతి శెట్టికి మేక్ ఆర్ బ్రేక్ లాంటిదిగా చెప్పొచ్చు. సక్సెస్ అయితేనే ఆమెకు ఇండస్ట్రీలో మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. మరి బేబమ్మ టైమ్ ఎలా ఉందో చూడాలి. అలాగే కోలీవుడ్ లో `జెన్నీ` అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. కానీ ఈ సినిమా మొదలై నెలలు గడు స్తున్నా? మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. సినిమా ఉందా? రద్దయిందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
