Begin typing your search above and press return to search.

బేబమ్మ డ్యాన్స్.. ఇది ఎవరు గుర్తించలేదే..!

కృతి శెట్టి తొలి సినిమా ఉప్పెన నుంచి ఇప్పటివరకు తెలుగులో 10 సినిమాల దాకా చేయగా అమ్మడిలో ఉన్న స్పెషల్ టాలెంట్ ని మన మేకర్స్ గుర్తించలేదు.

By:  Ramesh Boddu   |   10 Dec 2025 12:30 PM IST
బేబమ్మ డ్యాన్స్.. ఇది ఎవరు గుర్తించలేదే..!
X

ఉప్పెన సినిమాతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న బేబమ్మ అలియాస్ కృతి శెట్టి తెలుగులో వరుస ఫ్లాపులు ఫేస్ చేస్తుండగా కోలీవుడ్ లో మాత్రం అమ్మడికి మంచి అవకాశాలు వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ కార్తితో వా వాతియార్ సినిమా చేసింది కృతి శెట్టి. ఈ సినిమాను తెలుగులో అన్నగారు వస్తారు టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఈవెంట్ లో కార్తి కృతి శెట్టిపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కృతి శెట్టి తొలి సినిమా ఉప్పెన నుంచి ఇప్పటివరకు తెలుగులో 10 సినిమాల దాకా చేయగా అమ్మడిలో ఉన్న స్పెషల్ టాలెంట్ ని మన మేకర్స్ గుర్తించలేదు.

కృతి శెట్టిలోని ఆ టాలెంట్..

కార్తి మాత్రం కృతి శెట్టిలోని ఆ టాలెంట్ గుర్తించాడు. ఈవెంట్ లో మాట్లాడుతూ కృతి శెట్టి డ్యాన్స్ బాగా చేస్తుందని. తనతో మాత్రం సెకండ్ మీటర్ లో చేయి మిగతా 3, 4 ఇంటి దగ్గర పెట్టిరా అని చెప్పానని సరదాగా మాట్లాడారు కార్తి. కృతి శెట్టి యాక్టింగ్ గురించి అందరు చెప్పారు కానీ ఆమె డ్యాన్స్ గురించి ఎవరు ఇప్పటివరకు ఇలా చెప్పలేదు. అందరు అమ్మడి రోల్స్ మీద రొటీన్ అంటూ కామెంట్ చేయడమే కానీ ఆమెలోని ఈ డ్యాన్స్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయట్లేదు.

కనీసం కృతి శెట్టి డ్యాన్స్ గురించి ఎవరు ఇప్పటివరకు ప్రస్తావించిన సందర్భాలు లేవు. కానీ కార్తి స్పెసిఫిక్ గా కృతి శెట్టి డ్యాన్స్ గురించి చెప్పడంతో అందరు కృతిలోని ఈ టాలెంట్ ని మన వాళ్లు ఎందుకు వాడుకోలేదని అంటున్నారు. కృతి శెట్టి కోలీవుడ్ ప్రయత్నాలు ఒకదానికి మించి మరొకటి అనేలా ఉన్నాయి. వా వాతియార్ తో పాటు రవి మోహన్ తో జినీ, ప్రదీప్ రంగనాథన్ తో ఎల్.ఐ.కె చేస్తుంది కృతి శెట్టి.

డ్యాన్స్ ప్రధానంగా కృతికి అవకాశాలు..

అన్నగారు వస్తారు సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తుంది కృతి శెట్టి. మరి కార్తి చెప్పినట్టుగా ఆమె డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ బాగుంటే మాత్రం తెలుగులో డ్యాన్స్ ప్రధానంగా అయినా కృతికి అవకాశాలు ఇస్తారేమో చూడాలి. కృతి శెట్టి కూడా తెలుగులో మళ్లీ బిజీ అవ్వాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది.

ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. ఐతే ఆ టైంలో అన్ని వర్క్ అవుట్ అవుతాయనే ఉద్దేశ్యంతోనే కృతి శెట్టి ఆ సినిమాలు చేసింది. ఐతే బ్యాడ్ లక్ వల్ల సినిమాలన్నీ వరుసగా నిరాశ పరుస్తూ వచ్చాయి. ఐతే కోలీవుడ్ లో మాత్రం ఈసారి పకడ్బందీ ప్లానింగ్ తో వెళ్తుంది కృతి శెట్టి. కార్తి సినిమా హిట్ పడితే అక్కడ బోణీ తెరిచినట్టే. ఇక ప్రదీప్ లాంటి యూత్ హీరోతో నటించడం తో తమిళ్ లో ఆమెకు మరిన్ని ఛాన్స్ లు వస్తాయని చెప్పొచ్చు.