100 కోట్లు ఇచ్చినా ఇంకా సెకెండ్ ఛాన్స్ రాలేదా?
100 కోట్ల వసూళ్ల సినిమాలో భాగమైన ఏ హీరోయిన్ కైనా తిరుగులేని అవకాశాలొస్తాయి. నటిగా మరింత బిజీ అవుతుంది.
By: Srikanth Kontham | 2 Sept 2025 6:00 PM IST100 కోట్ల వసూళ్ల సినిమాలో భాగమైన ఏ హీరోయిన్ కైనా తిరుగులేని అవకాశాలొస్తాయి. నటిగా మరింత బిజీ అవుతుంది. దర్శక, నిర్మాతలు అలాంటి నటిని లక్కీ మస్కట్ గా భావిస్తారు. తమ సినిమాలో అదే నటి హీరోయిన్ గా భాగమైతే కలిసొస్తుందని పని గట్టుకుని మరి ఎంపిక చేస్తారు. నిర్మాత పారితోషికం ఆఫర్ చేయడంలోనూ ఎంత మాత్రం ఆలోచన చేయరు. ఎన్నికోట్లు ఇచ్చైనా తమ సినిమాలో భాగం చేసే ప్రయ త్నం చేస్తుంటారు. కానీ కృతిశెట్టి అలియాస్ బేబమ్మకు మాత్రం ఎలాంటి అవకాశాలు రాకపోవడం శోచనీయం.
పిలిచి మరీ అవకాశాలివ్వాలి:
గత ఏడాది మాలీవుడ్ లో `ఏఆర్ ఎమ్` సినిమాతో లాంచ్ అయింది. 30 కోట్ల బడ్జెట్ లో నిర్మాణమైన సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సినిమాలో అమ్మడు టోవినో థామస్ కు జోడీగా నటిం చింది. మలయళంలో టోవినో పెద్ద హీరో. జితిన్ లాల్ డైరెక్ట్ చేసిన చిత్రమిది. ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తయింది. అయితే ఇంత వరకూ కృతిశెట్టికి మాలీవుడ్ లో సెకెండ్ ఛాన్స్ రాలేదు. ప్రతిగా తమిళ్ లో అవకాశాలు అందుకుంటుంది. మాలీవుడ్ మాత్రం పిలిచి రెండవ ఛాన్స్ ఇవ్వలేదు.
లోటు చేయని టాలీవుడ్:
హిట్ వచ్చినా? అవకాశాలు అందుకోని నటిగా కృతి పేరు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మాలీవుడ్ పరిశ్రమతో పొలిస్తే టాలీవుడ్ లోనే ఎంతో బెటర్ గా అవకాశాలు అందుకుంది. తొలి సినిమా `ఉప్పెన`తో తెలుగులో భారీ విజయం అందుకుంది. దీంతో ఎడతెరపు లేకుండా పరిశ్రమలో అవకాశాలు అందుకుంది. అవి విజయాలు సాధించలేదు గానీ అవకాశాల పరంగా టాలీవుడ్ ఎంత మాత్రం లోటు చేయలేదు. అలాగే తమిళ్ లో సరైన సక్సెస్ లు లేకపోయినా అక్కడా బాగానే అవకాశాలు అందుకుంటుంది.
గ్లామర్ పాత్రలకు ఛాన్స్ లేదు:
మరి సక్సస్ ఉన్న మాలీవుడ్ లో ఛాన్సులు ఎందుకు రావడం లేదన్నది ఆసక్తికరం. మాలీవుడ్ లో ఏ నటి ఛాన్స్ వదలుకోదు. అక్కడ హీరోయిన్లను వల్గర్ చూపించే ప్రయత్నాలు జరగవు. కథా బలం ఉన్న చిత్రా లు..స్ట్రాంగ్ రోల్స్ తోనే సినిమాను ముందుకు నడిపిస్తారు తప్ప హీరోయిన్ అందాలను ఎరగా వేసి థియేటర కు రప్పించే ప్రయత్నాలు పెద్దగా జరగవు. మరి అలాంటి డీసెంట్ ఇండస్ట్రీ లో బేబమ్మకు ఛాన్సులు రాకపోవడంతో ఏంటో? చూడాలి.
