Begin typing your search above and press return to search.

వాయిదాల‌తో ఆ బ్యూటీ డీలా ప‌డిపోతుందా?

ఎవ‌రికైనా స‌క్సెస్ తోనే ఊపొస్తుంది. ఇంకా ఉత్సాహంగా రెట్టింపు వేగంతో ప‌ని చేయాలనిపిస్తుంది. అదే ప‌నిని ఇంకెన్ని ర‌కాలుగా చేయ‌గ‌ల‌మో! మైండ్ ఆలోచించ‌గ‌లుగుతుంది.

By:  Srikanth Kontham   |   23 Dec 2025 10:31 AM IST
వాయిదాల‌తో ఆ బ్యూటీ డీలా ప‌డిపోతుందా?
X

ఎవ‌రికైనా స‌క్సెస్ తోనే ఊపొస్తుంది. ఇంకా ఉత్సాహంగా రెట్టింపు వేగంతో ప‌ని చేయాలనిపిస్తుంది. అదే ప‌నిని ఇంకెన్ని ర‌కాలుగా చేయ‌గ‌ల‌మో! మైండ్ ఆలోచించ‌గ‌లుగుతుంది. స‌క్సెస్ లేని ప‌నితనంలో ఎంత మాత్రం ప‌స క‌నిపించ‌దు. న‌త్త‌న‌డ‌క‌న సాగుతుంది. చేద్దాంలే? చూద్దాంలే! అన్న‌ట్లే సాగుతుంది. తాజాగా ముంబై బ్యూటీ కృతిశెట్టి కూడా అలాగే డీలా ప‌డిన‌ట్లు క‌నిపిస్తుంది. కృతిశెట్టి టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతుంద‌నుకున్నారు. అందం, అభిన‌యం , `ఉప్పెన‌`లో బేబ‌మ్మ పెర్పార్మెన్స్ చూసి బేషుక్ గా కెరీర్ ఉంటుంద‌నుకున్నారు.

విడుద‌ల‌కు నోచుకోలేదు:

కానీ స‌న్నివేశం అందుకు రివ‌ర్స్ లో ఉంది. ఎక్క‌డ కాలు పెడితే? అక్క‌డ దుర‌దృష్టం త‌ప్ప అదృష్టంతో రాణించ‌లేక‌పోతుంది. తెలుగులో వైఫ‌ల్యాలు ఎదురైనా చాలా సినిమాలు చేసింది. కానీ స‌క్సెస్ మాత్రం ఓ గ‌మ్యాన్ని నిర్దేశించ‌లేక‌పోయింది. దీంతో కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డా అదే ప‌రిస్థితి. త‌మిళ్ లో ఏకంగా న‌టించిన సినిమాలే విడుద‌ల‌కు నోచుకోవ‌డం లేదు. కార్తీ హీరోగా న‌టించిన `వా వాత‌యార్` లో న‌టించింది. ఈ సినిమా పైనాన్స్ కార‌ణాలుగా వాయిదా ప‌డుతుంది. ఈనెల‌లోనే రిలీజ్ అవ్వాలి. కానీ రిలీజ్ అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌లేదు.

పాత బ‌కాయిలు చెల్లింపుల్లో విఫ‌లం:

పైనాన్స్ క్లియ‌ర్ అయితే గానీ రిలీజ్ కు కోర్టు అనుమ‌తిచ్చే ప‌రిస్థితులు లేవు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాదే ఈ సినిమా రిలీజ్ అయ్యేది. తెలుగులో ఈ చిత్రం `అన్న‌గారు వ‌స్తున్నారు` టైటిల్ తో అనువాద‌మైంది. అలాగే ఏడాది కాలంగా `ఎల్ ఐ కె` సినిమాది కూడా ఇదే ప‌రిస్థితి. ఇందులో అమ్మ‌డు ప్ర‌దీర్ రంగ‌నాధ్ కు జోడీగా న‌టించింది. విగ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో న‌య‌న‌తార నిర్మాణంలో రూపొందింది. షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్త‌యినా? ఇంత వ‌ర‌కూ రిలీజ్ కు నోచుకోలేదు. ఈ సినిమా కూడా పాత బకాయిలు చెల్లింపుల్లో జాప్యం కార‌ణంగా రిలీజ్ వాయిదా ప‌డుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

రిలీజ్ కోసం ఆస‌క్తిగా:

అన్నిర‌కాల సెటిల్ మెంట్లు క్లియ‌ర్ చేసి ఫిబ్ర‌వ‌రిలో ప్రేక్షకుల‌ ముందుకు తీసుకురావాల‌ని యోచిస్తున్నారు. మ‌రోవైపు జ‌యం ర‌వికి జోడీగా `జిన్నీ`లో సెకెండ్ లీడ్ పోషించింది. ఏడాది కాలంగా ఈ సినిమా సెట్స లో ఉన్న‌ట్లే క‌నిపిస్తోంది. షూటింగ్ మొద‌లైన నాటి నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. ఆ సినిమా షూటింగ్ పూర్త‌యిందా? లేదా? అన్న‌ది క్లారిటీ లేదు. కోలీవుడ్ మీడియాలో మాత్రం ఈ చిత్రం కూడా ఆర్దిక ఇబ్బందుల్లోనే ఉన్న‌ట్లు క‌థ‌నాలొస్తున్నాయి. దీంతో జ‌యం ర‌వి మిగ‌తా సినిమా షూటింగ్ ల్లోనూ బిజీ అవుతున్నాడు. కృతి శెట్టి మాత్రం వీటి రిలీజ్ ల కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తోంది. అవి రిలీజ్ అయి స‌క్సెస్ అయితే గానీ కొత్త అవ‌కాశాల‌కు మార్గం దొర‌క‌దు. మాలీవుడ్ లో `ఏఆర్ ఎమ్` సినిమాతో మంచి విజయం అందుకున్నా? అక్క‌డ మాత్రం బేబ‌మ‌మ్మ బిజీ కాలేక‌పోయింది.