నాగలక్ష్మి బాలీవుడ్ కి వెళ్తుందా?
`ఉప్పెన` చిత్రంతో ఓవర్ నైట్ ళక్ష స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న కృతి శెట్టి అలియాస్ నాగలక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు.
By: Srikanth Kontham | 15 Oct 2026 7:00 PM IST`ఉప్పెన` చిత్రంతో ఓవర్ నైట్ ళక్ష స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న కృతి శెట్టి అలియాస్ నాగలక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు. తొలి సినిమాతోనే కుర్రకారు మనసు దోచుకున్న బ్యూటీ ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లతో సౌత్ ఇండస్ట్రీలో దూసుకెళ్లింది. తాజాగా కృతి శెట్టి కెరీర్లో మరో అడుగు ముందుకేస్తుంది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ బాట పట్టేందుకు సిద్ధమైంది. హిందీ తెరపైనా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రముఖ దర్శకురాలు విధి గెడ్డగాంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సరికొత్త లవ్ స్టోరీ ప్రాజెక్ట్ ద్వారా కృతి శెట్టి బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోందని సమాచారం. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా.. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా ఈ మూవీ రూపుదిద్దుకోనుంది. విధి గెడ్డగాంకర్ టేకింగ్ .. నేటి తరానికి నప్పేలా ఉండే ఎమోషనల్ పాయింట్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సౌత్‌లో లవ్ అండ్ క్యూట్ క్యారెక్టర్లతో ప్రేక్షకులను కట్టిపడేసిన కృతి శెట్టి హిందీ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్ ఆడియన్స్‌ను కూడా ఫిదా చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కృతి గ్లామర్ మాత్రమే కాకుండా చక్కటి అభిన యానికి ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హిందీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి ఈ లవ్ స్టోరీ పర్ఫెక్ట్ లాంఛ్ ప్యాడ్ అవుతుందని నమ్ము తున్నారు.
ఇప్పటి వరకు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించిన కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీతో పాన్-ఇండియా ప్రయాణాన్ని మరింత విస్తృతం చేసుకోనుంది. విభిన్న భాషల చిత్రాల్లో నటిస్తూ తనలోని నటిని నిరంతరం మెరుగుపరుచుకుంటున్న అమ్మడికి హిందీ ప్రాజెక్ట్ కెరీర్ పరంగా టర్నింగ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. నేటి ట్రెండ్‌కు తగినట్లుగా యూత్‌ను అట్రాక్ట్ చేసే అన్ని హంగులు ఈ సినిమాలో ఉండేలా దర్శకురాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
సౌత్ నుంచి బాలీవుడ్‌కు వెళ్తున్న యంగ్ హీరోయిన్ల జాబితాలో కృతి శెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో ఆమె అక్కడ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
