కృతి శెట్టి బాలీవుడ్ డెబ్యూ లేనట్లేనా? ఏం జరిగింది?
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి అందరికీ తెలిసిందే. తక్కువ టైమ్ లో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుందనే చెప్పాలి.
By: M Prashanth | 17 Oct 2025 12:01 PM ISTయంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి అందరికీ తెలిసిందే. తక్కువ టైమ్ లో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుందనే చెప్పాలి. డెబ్యూ మూవీ ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. తెలుగులో ఉప్పెన తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ తో మంచి హిట్స్ సొంతమయ్యాయి.
కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. అక్కడ కూడా మంచి మార్కెట్ సంపాదించుకుంది. అలా సూపర్ యాక్టింగ్ తో పాటు అందం, సహజమైన ఎక్స్ప్రెషన్స్ తో కృతి దక్షిణాదిలో బలమైన ఫ్యాన్ బేస్ ను దక్కించుకున్న అమ్మడు.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. డెబ్యూ మూవీ ఫిక్స్ కూడా అయినట్లు టాక్ వినిపించింది.
బీ టౌన్ ప్రముఖ నటుడు గోవింద కుమారుడు యశ్వర్ధన్ అహుజా డెబ్యూ మూవీతోనే కృతి శెట్టి బాలీవుడ్ డెబ్యూ ఇవ్వనుందని వార్తలు వచ్చాయి. డబుల్ డెబ్యూ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఆ సినిమాకు సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ నిర్మిస్తుందని ప్రచారం జరిగింది.
అంతే కాదు ఆ సినిమా సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన ఓ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కనుందని టాక్ వినిపించింది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి హీరోయిన్ గా కృతి శెట్టి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి.. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ బేబీని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు హీరోయిన్ గా కృతి శెట్టిని అప్పట్లో ఫిక్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు యశ్వర్ధన్ అహుజా సరసన నటిస్తుందని వార్తలు రాగా.. ఆమెనే తప్పుకుంది. అసలేం ఏం జరిగిందోనని మాట్లాడుకుంటున్నారు.
కృతి శెట్టి.. బాలీవుడ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందోనని డిస్కస్ చేసుకుంటున్నారు. మూవీ టీమ్ కు.. హీరోయిన్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయేమోనని అభిప్రాయపడుతున్నారు. అయినా ఏం జరిగిందో వాళ్లకే తెలియాలి. ఇప్పుడు యశ్వర్ధన్ అహుజా మాత్రం డెబ్యూ మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన సరసన హీరోయిన్ గా కృతి స్థానంలో మరొకరిని మేకర్స్ సెలెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరేం జరిగిందో ఏంటో.
