వారసుడి కుమారుడితో బేబమ్మ కంబ్యాక్!
ప్రస్తుతం ఓ రెండు సినిమాలు అక్కడే చేస్తోంది. ఈ నేపథ్యంలో అమ్మడు మళ్లీ బాలీవుడ్ లో కంబ్యాక్ కి రెడీ అయింది.
By: Srikanth Kontham | 6 Oct 2025 8:00 PM ISTముంబై బ్యూటీ కృతిశెట్టి కెరీర్ నత్తనడకన సాగుతోంది. ఏ భాషలో అవకాశం వస్తే అక్కడ పని చేయడం తప్ప! స్థిరంగా ఓ భాషలో అవకాశాలు అందుకోలేకపోతుంది. ఇప్పటికే హిందీ, తెలుగు , తమిళం అంటూ మూడు భాషల్ని టచ్ చేసింది. కానీ ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది. ఏడాదిన్నర కాలంగా కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఓ రెండు సినిమాలు అక్కడే చేస్తోంది. ఈ నేపథ్యంలో అమ్మడు మళ్లీ బాలీవుడ్ లో కంబ్యాక్ కి రెడీ అయింది. బాలీవుడ్ స్టార్ గోవిందా కుమారడైన యశ్వర్దన్ అహుజా హీరోగా సాజిద్ ఖాన్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
బాలీవుడ్ లో రెండవ చిత్రం:
సౌత్ లో విజయం సాధించిన ఓ సినిమాకు రీమేక్ ఇది. బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో హీరోయిన్ గా కృతిశెట్టి ఎంపికైనట్లు సమాచారం. పలువురు బాలీవుడ్ హీరోయిన్లను పరిశీలించినా? సాజిద్ ఖాన్ రాసిన పాత్రకు పర్పెక్ట్ గా కృతిశెట్టి సెట్ అవ్వడంతో టెస్ట్ షూట్ నిర్వహించి ఫైనల్చేసారట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం. కృతికి బాలీవుడ్ లో రెండవ చిత్రం. తొలుత అమ్మడి కెరీర్ బాలీవుడ్ లోనూ `సూపర్ 30` తో ప్రారంభమైన సంగతి తెలిసిందే.
తొలి సినిమాతోనే గ్రాండ్ విక్టరీ:
హృతిక్ రోషన్ కథానయాకుడిగా వికాస్ భాల్ దర్శకత్వం వహించిన సినిమా పెద్ద విజయం సాధించింది. 60 కోట్ల బడ్జెట్లోనే నిర్మించిన సినిమా 200కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇందులో కృతిశెట్టి ఎక్స్ లెన్స్ స్టూడెంట్ పాత్రలో నటించింది. పాత్ర చిన్నది కావడంతో పెద్దగా హైలైట్ అవ్వలేదు. అటుపై రెండేళ్లకు `ఉప్పెన`లో హీరో యిన్ అవకాశం వచ్చింది. అలా టాలీవుడ్ లో అమ్మడు లాంచ్ అయింది. తొలి సినిమాతోనే ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. నటిగా మంచి ఫేమస్ అయింది. బోల్డ్ పెర్పార్మెన్స్ తో యువతను ఆకట్టుకుంది.
కంబ్యాక్ తోకైనా క్లిక్ అవుతుందా:
ఇంత ట్యాలెంటెడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. అన్ని ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో స్టార్ గా నిలదొక్కుకోలేకపోతుంది. నిరూపించుకునే అవకాశాలు వచ్చినా? వైఫల్యా లు అంతకంతకు వెనక్కి నెట్టుతున్నాయి. తెలుగు, తమిళ్ లో ఇలాగే కెరీర్ కొనసాగింది. మరి బాలీవుడ్ కంబ్యాక్ తో నైనా నిలదొక్కుకుంటుందేమో చూడాలి.
