బుల్లెట్ బేబి చివరి అస్త్రం ప్రయోగిస్తుందా?
ఇందులో కృతి బోల్డ్ యాంగిల్ ని హైలైట్ చేయబోతుందనే ప్రచారం జరుగుతోంది. యువ హీరోతో పెదవి ముద్దుల్లో, బెడ్ రూమ్ సన్నివేశాల్లో సైతం కనిపించనుందని నెట్టింట కథనాలు వెడెక్కిస్తున్నాయి.
By: Sivaji Kontham | 2 Sept 2025 8:30 AM ISTకృతిశెట్టి అలియాస్ బేబమ్మ స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయమనుకున్నారు. అందం, అభినయం, ప్రతి భతో సునాయాసంగా స్టార్ లీగ్ లో చేరుతుందనుకున్నారంతా. కానీ తాను ఒకటి తలిస్తే ఇండస్ట్రీ మరోటి తలిచింది. తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమాలు చేసినా? డెబ్యూ `ఉప్పెన` తప్ప మరేది అమ్మడికి కలిసి రాలేదు. గత ఏడాది మాలీవుడ్ లో కూడా లాంచ్ అయింది. కానీ అక్కడా ఇంత వరకూ సెకెండ్ ఛాన్స్ రాలేదు. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో ఉన్నది మూడు సినిమాలే. ఆ మూడు కూడా తమిళ చిత్రాలే.
కోలీవుడ్ ని షేక్ చేస్తోన్న వార్త:
`వవాతయార్` ,` లవ్ ఇన్సురెన్స్`, `జెన్నీ` చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో మొదటి రెండు చిత్రాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా `లవ్ ఇన్స్ రెన్స్` లోని బేబమ్మ రోల్ గురించి ఓ వార్త కోలీవుడ్ మీడియాని షేక్ చేస్తోంది. లవ్ ఇన్స్ రెన్స్ లో యువ హీరో ప్రదీప్ రంగనాధ్ కు జోడీగా నటిస్తోంది. విగ్నేష్ శివన్ నిర్మిస్తుండగా నయనతార నిర్మిస్తోంది. ఇదొక రొమాంటిక్ కామెడీ జానర్ చిత్రం. అయితే ఈ సినిమా కోసం బేబమ్మ తనలోని చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తుట్లు వార్త లొస్తున్నాయి.
ఆమె లో బోల్డ్ యాంగిల్:
ఇందులో కృతి బోల్డ్ యాంగిల్ ని హైలైట్ చేయబోతుందనే ప్రచారం జరుగుతోంది. యువ హీరోతో పెదవి ముద్దుల్లో, బెడ్ రూమ్ సన్నివేశాల్లో సైతం కనిపించనుందని నెట్టింట కథనాలు వెడెక్కిస్తున్నాయి. ఇలాం టి సన్నివేశాలు బేబమ్మకు కొత్తేం కాదు. తొలి సినిమా `ఉప్పెన`లోనే చెలరేగింది. కానీ ఆ తర్వాత అలాం టి ఛాన్స్ మరే సినిమాకు తీసుకోలేదు. గ్లామర్ పాత్రల్లో నటించే అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్క రించింది. కానీ ఎల్ ఐసీ లో అలాంటి తిరస్కరణలకు తావు లేకుండా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
దర్శకుల హీరోయిన్ గా:
మరి ఈ ఛాన్స్ తీసుకోవడం ఈ సినిమాకేనా? సెట్స్ లో ఉన్న మిగతా చిత్రాలకు తీసుకుందా? అంటే అక్కడా తాను దర్శకుల హీరోయిన్ గానే పనిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. `వా వాతాయార్` క కంప్లీట్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే చిత్రీకరణ కూడా పూర్తయిన చిత్రమది. మరో సినిమా `జెన్నీ` ఫాంటసీ కామెడీ థ్రిల్లర్. ఇది సెట్స్ లో ఉన్న చిత్రం. మరి ఈ సినిమాలో రొమాన్స్ కి ఎలాంటి ఛాన్స్ తీసుకుంటుందో చూడాలి.
